శుభవార్త: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా నెగెటివ్.. నిలకడగా ఆరోగ్యం

  • Published By: sekhar ,Published On : August 24, 2020 / 11:27 AM IST
శుభవార్త: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా నెగెటివ్.. నిలకడగా ఆరోగ్యం

sp balasubramaniam health, SPB tested negative for Covid-19: కరోనా బారిన పడిన గాన గంధర్వుడు, సుప్రసిద్ధ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం క్షేమంగా తిరిగి రావాలని దేశం మొత్తం ప్రార్థనలు చేస్తోంది. బాలు ప్రస్తుతం చెన్నై ఎం.జి.ఎం హెల్త్ కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. బాలు ఆరోగ్యంగా తిరిగి రావాలని సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ కోరుకుంటున్నారు.



తాజాగా ఆసుపత్రి వర్గాలవారు బాలు ఆరోగ్యం గురించి అప్‌డేట్ ఇచ్చారు.
ఈ రోజు నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగెటివ్‌ వచ్చినట్టు ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి… గత కొన్ని రోజులుగా ఎక్మో మరియు వెంటిలేటర్ పరికరాల సహాయంతో చికిత్స పొందుతున్న బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిలకడగా ఉందని, క్రమేపి కోలుకొంటున్నారని పేర్కొన్నారు MGM వైద్యులు తెలిపారు.

బాలు ఆరోగ్యం గురించి తనయుడు ఎస్పీ చరణ్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా సమాచారమందిస్తున్నారు. కాగా బాలు త్వరగా కోలుకోవాలంటూ ఆయన అభిమానులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు.