Sreeleela : లక్కంటే శ్రీలీలదే.. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో ఏకైక హీరోయిన్.. స్వయంగా చంద్రబాబుకు పరిచయం చేసిన బాలయ్య..

తాజాగా జరిగిన ఇన్సిడెంట్ తో లక్కంటే శ్రీలీలదే అని అంటున్నారు. తాజాగా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి చంద్రబాబు, బాలకృష్ణతో సహా పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ హీరో, హీరోయిన్స్, టాలీవుడ్ ప్రముఖులు.. ఎంతో మంది వచ్చారు.

Sreeleela : లక్కంటే శ్రీలీలదే.. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో ఏకైక హీరోయిన్.. స్వయంగా చంద్రబాబుకు పరిచయం చేసిన బాలయ్య..

Sreeleela in NTR 100 Years event at Hyderabad Balakrishna Introduce Sreeleela to Chandrababu Naidu

Sreeleela :  ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉన్న హీరోయిన్స్ లో శ్రీలీల(Sreeleela) ముందు వరుసలో ఉంటుంది. పెళ్లి సందD(Pelli SandaD) సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ధమాకా(Dhamaka)తో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇక ధమాకా తర్వాత శ్రీలీల భారీగా అభిమానులను సంపాదించుకోవడమే కాక టాలీవుడ్ లో వరుస అవకాశాలు సంపాదించుకుంది. ప్రస్తుతం శ్రీలీల చేతిలో ఏకంగా 10 సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే శ్రీలీల ఫుల్ జోష్ లో ఉంది, సూపర్ టైం నడుస్తుంది తనకు అని అంతా అభిప్రాయపడుతున్నారు.

తాజాగా జరిగిన ఇన్సిడెంట్ తో లక్కంటే శ్రీలీలదే అని అంటున్నారు. తాజాగా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి చంద్రబాబు, బాలకృష్ణతో సహా పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ హీరో, హీరోయిన్స్, టాలీవుడ్ ప్రముఖులు.. ఎంతో మంది వచ్చారు. ఈ ఈవెంట్ లో ఎన్టీఆర్ తో పనిచేసిన సీనియర్ హీరోయిన్స్ కూడా వచ్చారు. అయితే ఈ జనరేషన్ కి చెందిన హీరోయిన్స్ లో శ్రీలీల ఒక్కటే ఉండటం విశేషం.

శ్రీలీల ఒక్కదానికే ఈ వేడుకకు ఇన్విటేషన్ వచ్చింది. అంతే కాకుండా స్టేజిపైన బాలయ్య బాబు శ్రీలీలను తీసుకెళ్లి చంద్రబాబుకి స్వయంగా పరిచయం చేశారు. ఇక స్టేజిపై శ్రీలీల కూడా మాట్లాడింది. దీంతో లక్కంటే శ్రీలీలదే, మాములు అదృష్టం కాదు కదా అని అందరూ శ్రీలీలను అభినందిస్తున్నారు. అంతమంది పెద్ద వాళ్ళ ముందు, స్టార్స్ ముందు ఒకే ఒక్క హీరోయిన్, అక్కడున్న వాళ్ళందరి కంటే ఏజ్ లో చాలా చిన్న అయినా శ్రీలీలకు ఈ అవకాశం రావడంతో ఆమె అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇక ఆ వేడుకల్లో శ్రీలీల ఫొటోలు వైరల్ గా మారాయి.

Ram Charan : ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో చరణ్ స్పీచ్.. నందమూరి వర్సెస్ మెగా వార్ ఇప్పటికైనా ఆగుతుందా?

అయితే శ్రీలీల ప్రస్తుతం బాలకృష్ణ, అనిల్ రావిపూడి సినిమాలో బాలయ్య బాబుకి కూతురిగా నటిస్తుంది. ఈ నేపథ్యంలో బాలయ్యకు దగ్గరవ్వడంతో బాలయ్యే ఈ ఈవెంట్ కు పిలిచినట్టు సమాచారం. ఏదైతేనేం శ్రీలీల మాత్రం ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ ఫామ్ లో ఉంది. వరుస సినిమాలతో, స్టార్స్ తో కలిసి నటించడం, ఇప్పుడు ఇలా పెద్ద ఈవెంట్ లో భాగమవ్వడంతో ఆమెను అభినందించడమే కాక కొంతమంది జెలసీగా కూడా ఫీల్ అవుతున్నారట.