Pushpa: శ్రీవల్లి సాంగ్.. మరోసారి యూట్యూబ్‌లో పుష్ప మేనియా!

పుష్ప.. సినిమా రిలీజ్ అవ్వకముందే ప్రమోషన్లతో పిచ్చెక్కించేస్తున్నారు. ఇదిగో వస్తున్నాం.. అదిగో వస్తున్నాం అని ఊరిస్తూ.. ఫ్యాన్స్ లో పుష్ప ఫీవర్ తెప్పిస్తున్నారు. ఫస్ట్ సాంగ్ తోనే..

10TV Telugu News

Pushpa: పుష్ప.. సినిమా రిలీజ్ అవ్వకముందే ప్రమోషన్లతో పిచ్చెక్కించేస్తున్నారు. ఇదిగో వస్తున్నాం.. అదిగో వస్తున్నాం అని ఊరిస్తూ.. ఫ్యాన్స్ లో పుష్ప ఫీవర్ తెప్పిస్తున్నారు. ఫస్ట్ సాంగ్ తోనే ఇండస్ట్రీలో రికార్డ్ క్రియేట్ చేసిన పుష్ప .. సెకండ్ సాంగ్ తో ఆ రికార్డ్ ని బ్రేక్ చేసేలా కనిపిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, దాక్కో దాక్కో మేక పాటకు మంచి రెస్పాన్స్ రాగా రష్మిక మందన్న శ్రీవల్లి పాట విడుదల చేశారు మేకర్స్. రష్మిక మందన్నపై చిత్రీకరించిన శ్రీవల్లి పాటకు అనూహ్య స్పందన వస్తుంది.

Samantha: సామ్ బాలీవుడ్ ప్లాన్స్.. త్వరలోనే గుడ్ న్యూస్!

సెన్సేషనల్ సింగర్ సిద్ శ్రీరామ్ ఈ పాటను ఆలపించారు. ఈ పాటలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా అద్భుతంగా ఉన్నారు. ఈ మధ్యే విడుదలైన రష్మిక మందన్న ఫస్ట్ లుక్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. రష్మిక, బన్నీ పూర్తిగా డీ గ్లామర్ లుక్ లో కనిపిస్తున్న ఈ పాటలో ఏదో మ్యాజిక్ కనిపిస్తుంది. ఇక, బన్నీ -సుకుమార్ కాంబినేషన్ అంటే జనరల్ గానే జనాల్లో క్యూరియాసిటీ ఉంటుంది. అలాంటిది పుష్ప హ్యాట్రిక్ మూవీ కావడంతో ఇది కాస్త ఎక్కువైంది. ఇక పుష్పలో బన్నీ లుక్స్ చూసిన తర్వాత ఇంట్రస్ట్ ఇంకాస్త ఎక్కువైంది.

Sony Charishta: చూపులతోనే మత్తు జల్లేస్తున్న నేపాలీ బ్యూటీ

ఇప్పుడు పుష్పకు సంబందించి ఒక్కో సాంగ్ బయటికొస్తుంటే.. ఫ్యాన్స్ లో జోష్, ఎక్స్ పెక్టేషన్స్ పీక్స్ కి చేరిపోతోంది. పుష్ప టీజర్ తోనే సినిమా మీద హైప్స్ పెంచేసిన టీమ్.. ఇప్పుడు ఒక్కో సాంగ్ రిలీజ్ చేస్తూ.. సినిమా ఎక్స్ పెక్టేషన్స్ ని పీక్స్ కి తీసుకెళుతున్నారు. దాక్కో దాక్కో అంటూ పుష్ప రాజ్ థీమ్ సాంగ్ తో ఇండస్ట్రీలో రికార్డ్ క్రియేట్ చేస్తే.. ఇప్పుడు రష్మిక శ్రీవల్లి సాంగ్ తో ఆ రికార్డ్ ని బ్రేక్ చేసేలా కనిపిస్తున్నారు.

Bheemla Nayak: ప్రోమో సిద్ధం.. సెకండ్ సింగల్‌కి వేళాయే..!

బన్నీ సినిమాలకు దేవిశ్రీ ప్రసాద్ చేసే మ్యాజిక్ తెలిసిందే. అయితే ఈ సారి మాత్రం ఆ డోస్ డబుల్ అయ్యింది. దాక్కో దాక్కో మేకతో హీరో అగ్రెషన్ చూపించిన టీమ్.. శ్రీవల్లి పాటతో లవ్ యాంగిల్ ని చూపిస్తున్నారు. చూపే బంగారమాయెనే అంటూ సిద్ద శ్రీరామ్ పాడిన శ్రీవల్లి సాంగ్ ఆడియన్స్ లో ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తుంటే.. ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అని ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Aditi Rao Hydari: అదితి ఆశలు.. ఈసారి హిట్టు కొడతానంటున్న హైదరాబాదీ!

నిను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే..
నీ చూపుల పైనే రెప్పలు వేసి కప్పేస్తావే..
కనిపించని దేవున్ని కన్నార్పక చూస్తావే..
కన్నుల ఎదుటే నేనంటే కాదంటున్నావే..

చూపే బంగారమాయనే.. శ్రీవల్లి..
మాటే మాణిక్యమాయనే..
చూపే బంగారమాయనే.. శ్రీవల్లి..
నవ్వే నవరత్నమాయనే..

అన్నిటికీ ఎప్పుడూ ముందుండే నేను..
నీ వెనకే ఇపుడూ పడుతూ ఉన్నాను..
ఎవరికీ ఎప్పుడూ తలవంచని నేను..
నీ పట్టి చూసేటందుకు తలనే వంచాను..
ఇంత బతుకు బతికి నే.. నీ ఇంటి చుట్టూ తిరిగానే..
ఇసుమంతా నన్ను చూస్తే చాలు చాలనుకున్నానే..

చూపే బంగారమాయనే.. శ్రీవల్లి..
మాటే మాణిక్యమాయనే..
చూపే బంగారమాయనే.. శ్రీవల్లి..
నవ్వే నవరత్నమాయనే..

నీ స్నేహితురాళ్ళు ఓ మోస్తరుగా ఉంటారు..
అందుకనేమో నువ్వు అందంగా ఉంటావు..
18 ఏళ్ళు వచ్చాయా చాలు.. నువ్వే కాదెవ్వరైనా ముద్దుగా ఉంటారు..
ఎర్రచందనం చీరకడితే రాయి కూడా రాకుమారే..
ఏడురాళ్ల దుద్దులు పెడితే ఎవతైన అందగత్తే..
అయినా..

చూపే బంగారమాయనే.. శ్రీవల్లి..
మాటే మాణిక్యమాయనే..
చూపే బంగారమాయనే.. శ్రీవల్లి..
నవ్వే నవరత్నమాయనే..