SSMB28 Update: మహేష్ మూవీ నుండి ఆ రోజున సర్‌ప్రైజ్ రానుందా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో చాలా కాలం తరువాత సినిమా తెరకెక్కుతుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. అయితే ఈ సినిమా నుండి త్వరలోనే ఓ అదిరిపోయే అప్డేట్ రాబోతున్నట్లు చిత్ర వర్గాల్లో ఓ వార్త జోరుగా వినిపిస్తోంది.

SSMB28 Update: మహేష్ మూవీ నుండి ఆ రోజున సర్‌ప్రైజ్ రానుందా..?

SSMB28 Update To Be Revealed On Trivikram Birthday

SSMB28 Update: సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో చాలా కాలం తరువాత సినిమా తెరకెక్కుతుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని, ప్రస్తుతం రెండో షెడ్యూల్ కోసం రెడీ అవుతోంది. ఈ సినిమాతో మహేష్, త్రివిక్రమ్ కాంబో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

SSMB28: మహేష్-త్రివిక్రమ్ మూవీపై అదిరిపోయే అప్డేట్.. ఏమిటంటే?

అయితే ఈ సినిమా నుండి త్వరలోనే ఓ అదిరిపోయే అప్డేట్ రాబోతున్నట్లు చిత్ర వర్గాల్లో ఓ వార్త జోరుగా వినిపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీలుక్ పోస్టర్ లేదా టైటిల్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రివీల్ చేసేందుకు రెడీ అవుతోందట. అయితే ఈ అప్డేట్ ఎప్పుడు వస్తుందనే విషయంపై కూడా క్లారిటీ ఇస్తున్నాయి చిత్ర వర్గాలు. నవంబర్ 7న త్రివిక్రమ్ పుట్టినరోజు కానుకగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ రావచ్చనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

SSMB28: మహేష్ సినిమాకు ఆ టైటిల్ అయితేనే బెస్ట్ అంటోన్న ఫ్యాన్స్!

మరి నిజంగానే నవంబర్ 7న మహేష్ బాబు 28వ చిత్రానికి సంబంధించిన అప్డేట్ వస్తుందా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఈ సినిమాను త్రివిక్రమ్ తనదైన మార్క్ ఎంటర్‌టైనర్ మూవీగా మలుస్తుండగా, ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. అందాల భామ పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోండగా హారికా అండ్ హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తోంది.