Pushpa 2: ఫస్ట్ పార్ట్ ఇచ్చిన సక్సెస్.. పుష్ప-2పై భారీ అంచనాలు!

పుష్ప.. ఇప్పుడు సౌత్ టూ నార్త్ బ్లాక్ బస్టర్ సక్సెస్ తో మోత మోగిపోతున్న సినిమా. ఈ కోవిడ్ క్రైసిస్ టైమ్ లో రిలీజ్ అయ్యి అన్ని రికార్డుల్ని..

Pushpa 2: ఫస్ట్ పార్ట్ ఇచ్చిన సక్సెస్.. పుష్ప-2పై భారీ అంచనాలు!

Pushpa

Pushpa 2: పుష్ప.. ఇప్పుడు సౌత్ టూ నార్త్ బ్లాక్ బస్టర్ సక్సెస్ తో మోత మోగిపోతున్న సినిమా. ఈ కోవిడ్ క్రైసిస్ టైమ్ లో రిలీజ్ అయ్యి అన్ని రికార్డుల్ని బద్దలుకొట్టి సక్సెస్ ఫు ల్ అయ్యి బన్నీకి మరో హ్యూజ్ సక్సెస్ ఇచ్చిన సినిమా. అయితే పుష్ప తెచ్చిన సంతోషం కంటే.. టెన్షనే ఎక్కువగా ఉంది. ఇప్పటికే భారీ సక్సెస్ అయ్యి ఆడియన్స్ లో పిచ్చి క్రేజ్ తెచ్చుకున్న పుష్ప సెకండ్ పార్ట్ మీద విపరీతమైన ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. మరి పుష్ప ద రూల్ ఎలా ఉండబోతోంది..?

Allu Arjun: బన్నీ కోసం బాలీవుడ్ ప్రెస్టీజియస్ బ్యానర్స్ వెయిటింగ్!

ఇలాగే ఎక్కడా తగ్గకుండా సౌత్ టూ నార్త్ అదిరిపోయే కలెక్షన్లతో దూసుకుపోయింది పుష్ప. సుకుమార్ బన్నీ కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీ గా ఫస్ట్ నుంచి క్రేజ్ సంపాదించుకున్న పుష్ప రిలీజ్ అయ్యాక అసలు అన్ ఎక్స్ పెక్టెడ్ సక్సెస్ తో అందరికీ షాక్ ఇచ్చింది. ఫస్ట్ పార్ట్ రచ్చ చూసిన ఆడియన్స్ కి.. సెకండ్ పార్ట్ మీద ఎక్స్ పెక్టేషన్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. అందుకే ఈ సక్సెస్ కి మ్యాచ్ అయ్యేలా సెకండ్ పార్ట్ కి స్కెచ్ గట్టిగానే వేస్తున్నారు బన్నీ..సుక్కు.

RRR: చరణ్-తారక్ లలో రాజమౌళికి ఇష్టమైన పాత్ర ఇదే!

పెద్దగా హైప్ లేకుండా లో ప్రొఫైల్ లోనే వచ్చిన పుష్ప.. హ్యూజ్ సక్సెస్ తో అదరగొట్టింది. అసలు పెద్దగా ప్రమోషన్లు చెయ్యని నార్త్ లో 100కోట్ల కలెక్షన్లలో రికార్డ్ క్రియేట్ చేసింది. అందుకే ఈ సారి సెకండ్ పార్ట్ మీద విపరీతంగా బాలీవుడ్ లో కూడా అంచనాలు పెరిగిపోయాయి. ఫస్ట్ పార్ట్ లోనే పుష్ప రాజ్ క్యారెక్టర్ ని ఆడియన్స్ లో బాగా ఇంజెక్ట్ చేసిన సుకుమార్.. సెకండ్ పార్ట్ లో మరింత ఎక్జైటింగ్ గా ఎలివేట్ చెయ్యబోతున్నారు.

Pushpa: శ్రీవల్లి పాటకి ప్రధాని నరేంద్ర మోడీ స్టెప్పులేస్తే?!

పుష్ప సినిమా సూపర్ సక్సెస్ తో నెక్ట్స్ మన్త్ నుంచి స్టార్ట్ అవ్వబోతున్న సెకండ్ పార్ట్ మీద ఎక్స్ పెక్టేషన్స్ రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. లుక్ దగ్గరనుంచి బాడీ లాంగ్వేజ్ వరకూ ఎక్కడా స్టైలిష్ స్టార్ ఛాయలు కూడా చూపించని బన్నీ.. సెకండ్ పార్ట్ కి రెమ్యూనరేషన్ కూడా గట్టిగానే పెంచేశారని టాక్. ఫస్ట్ పార్ట్ ఇచ్చిన సక్స్ తో సెకండ్ పార్ట్ కోసం 75 కోట్లు డిమాండ్ చేస్తున్నారని రూమర్ నడుస్తోంది. ఫస్ట్ పార్ట్ పుష్ప ద రైజ్ లోనే పీక్స్ లో బన్నీ యాటిట్యూడ్ చూపించిన సుకుమార్.. సెకండ్ పార్ట్ పుష్ప ద రూల్ లో అసలు ఆడియన్స్ ఎక్స్ పెక్ట్ చెయ్యని యాటిట్యూడ్ తో పాటు ట్విస్ట్ లు ఇవ్వబోతున్నారు. అందుకే సెకండ్ పార్ట్ అంచనాల్ని అన్ని రకాలుగా అందుకోవడానికి ప్లాన్ గట్టిగానే రెడీ చేసుకున్నారు సుకుమార్..బన్నీ.