Rakshasudu2: ‘రాక్షసుడు 2’లో ఆ స్టార్ హీరో కన్ఫం..?

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘రాక్షసుడు’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించేందుకు దర్శకుడు రమేష్ వర్మ రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో ఓ స్టార్ హీరో నటిస్తాడనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించింది.

Rakshasudu2: ‘రాక్షసుడు 2’లో ఆ స్టార్ హీరో కన్ఫం..?

Sudeep Kichcha Confirmed In Rakshasudu 2

Rakshasudu 2: బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘రాక్షసుడు’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. కాగా, ఈ సినిమాను దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించేందుకు దర్శకుడు రమేష్ వర్మ రెడీ అవుతున్నాడు.

Ramesh varma : స్టేజిపైనే హీరోయిన్‌కి సారీ చెప్పిన ఖిలాడీ డైరెక్టర్

ఇప్పటికే ఈ సినిమాను అనౌన్స్ చేసిన డైరెక్టర్, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ మూవీని రాక్షసుడు సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ సినిమాలో ఓ స్టార్ హీరో నటిస్తాడనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించింది. కాగా ఈ సినిమాలో ఎవరు నటిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ లీడ్ రోల్‌లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

తాజాగా సుదీప్‌ను చిత్ర యూనిట్ కన్ఫం చేసినట్లు తెలుస్తోంది. కానీ దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాను సత్యనారాయణ కోనేరు ప్రొడ్యూస్ చేస్తుండగా, గిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే వెల్లడించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు.