Sukumar : పుష్ప హిట్ అవ్వడానికి అది కూడా కారణమే.. అందుకే పుష్ప 2 రాసేటప్పుడు..

ఒక సినిమా హిట్ అవ్వడానికి అనేక కారణాలు ఉంటాయి. వాటిల్లో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సోషల్ మీడియా కూడా ఒక కారణం. పుష్ప సినిమా విజయంలోనూ సోషల్ మీడియా ముఖ్య పాత్ర పోషించింది. సోషల్ మీడియాలో పుష్ప సినిమాలోని డైలాగ్స్, సాంగ్స్ బాగా వైరల్ అవ్వడంతో.................

Sukumar : పుష్ప హిట్ అవ్వడానికి అది కూడా కారణమే.. అందుకే పుష్ప 2 రాసేటప్పుడు..

Sukumar said pushpa movie gets hit due to dialogues and songs of pushpa viral in social media

Sukumar :  అల్లుఅర్జున్, రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా అనూహ్యంగా భారీ విజయం సాధించింది. సౌత్ లో కంటే కూడా ఈ సినిమా నార్త్ లో బాగా హిట్ అయింది. సినిమా రిలీజ్ కి ముందే పుష్ప లోని పాటలు, డైలాగ్స్, స్టెప్పులు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. సోషల్ మీడియా వల్ల పుష్ప గురించి ప్రపంచమంతటా తెలిసింది.

ఒక సినిమా హిట్ అవ్వడానికి అనేక కారణాలు ఉంటాయి. వాటిల్లో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సోషల్ మీడియా కూడా ఒక కారణం. పుష్ప సినిమా విజయంలోనూ సోషల్ మీడియా ముఖ్య పాత్ర పోషించింది. సోషల్ మీడియాలో పుష్ప సినిమాలోని డైలాగ్స్, సాంగ్స్ బాగా వైరల్ అవ్వడంతో ఈ సినిమాకి మరింత విజయం అందింది. ఈ మాట ఇప్పుడు దర్శకుడు సుకుమార్ కూడా అన్నారు.

Ram Charan : రాజమౌళి ఇండియన్ స్పీల్‌బర్గ్.. రామ్ చరణ్ వ్యాఖ్యలు..

తాజాగా ఓ ఈవెంట్ లో పాల్గొన్న సుకుమార్ సోషల్ మీడియా గురించి మాట్లాడుతూ.. పుష్ప సినిమా విజయంలో సోషల్ మీడియా కూడా ఓ భాగమైంది. సోషల్ మీడియా వల్లే పుష్ప సినిమాలోని పాటలు, డైలాగ్స్ అంతలా ఫేమస్ అయ్యాయి. ఒక సినిమాలో వచ్చే డైలాగ్స్, సాంగ్స్ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ గా, యూట్యూబ్ షార్ట్స్ గా వస్తాయని తెలుసు. అందుకే నేను సినిమాని రాసేటప్పుడు సోషల్ మీడియాని కూడా దృష్టిలో ఉంచుకొని రాస్తాను. ఇప్పుడు పుష్ప 2 సినిమా విషయంలో కూడా అంతే ఇందులోని డైలాగ్స్, సాంగ్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి అని అన్నారు. దీంతో పుష్ప 2లో కూడా అదిరిపోయే సాంగ్స్, డైలాగ్స్ ఉండనున్నట్టు అభిమానులు భావిస్తున్నారు.