Sunny Leone: భర్తతో సన్నీ ఫన్నీ ప్రాంక్.. వీడియో వైరల్!

సన్నీలియోన్.. ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా చాలా పాపులర్. ఎందుకు పాపులరో.. ఆమె గతం ఏంటో అందరికీ తెలిసిందే. నీలి చిత్రాల ఇండస్ట్రీలలో ఆమె నటి మాత్రమే కాదు.. నిర్మాత కూడా.

Sunny Leone: భర్తతో సన్నీ ఫన్నీ ప్రాంక్.. వీడియో వైరల్!

Sunnyleone (image:instagram)

Sunny Leone: సన్నీలియోన్.. ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా చాలా పాపులర్. ఎందుకు పాపులరో.. ఆమె గతం ఏంటో అందరికీ తెలిసిందే. నీలి చిత్రాల ఇండస్ట్రీలలో ఆమె నటి మాత్రమే కాదు.. నిర్మాత కూడా. ఆమె ఆ ఇండస్ట్రీలో భారీ ఫాలోయింగ్ ఉన్న స్టార్. అయితే, అదంతా గతం.. జిస్మ్ 2 సినిమాతో ఆమె బాలీవుడ్ లో అరంగేట్రం చేయడం.. ఇండియాలో సెటిలై ఇండియన్ సినిమాల మీద దృష్టి పెట్టింది. ప్రస్తుతం సన్నీ హిందీతో పాటు కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ సినిమాలలో కూడా నటిస్తుంది.

Pragya Jaiswal: ప్రగ్యా గ్లామర్ ట్రీట్.. కంచె దాటేస్తుందా!

సినిమాలతోనే కాదు.. సన్నీ సోషల్ మీడియా ద్వారా కూడా భారీ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. తన భర్త డేనియల్ తో కలిసి సరదా వీడియోలతో పాటు హాట్ హాట్ ఫోటో షూట్లతో కూడా సన్నీ సోషల్ మీడియాలో ఎప్పుడూ ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. కాగా, గతంలో కూడా భర్తతో కలిసి సన్నీ చేసిన ఫ్రాంక్ వీడియోలకు భారీ వ్యూస్ సొంతం చేసుకోగా తాజాగా సన్నీ చేసిన ఓ ఫ్రాంక్ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇందులో భర్త డేనియల్ మీదనే సన్నీ ఫ్రాంక్ చేయడం విశేషం.

KGF 2: ముందే రానున్న యష్.. ప్రభాస్‌తో పోటీ లేనట్లేనా?

ఆ వీడియోలో.. సన్నీ తాళ్లతో కలిపి కట్టిన సీసాలను రెండు చేతుల్లో పట్టుకోమని చెప్పింది. అనంతరం బుక్స్‌, దానిపై పిండి బుట్టను పెట్టింది. అంత అయిపోయాకా కూడా ఇంకా ఏదో పెడుతున్నట్లు నటించిన ఈ భామ కత్తెరతో తాళ్లను కత్తిరించింది. అంతే బుట్టలో పిండి మొత్తం డేనియల్ ముఖంపై పడింది. దీంతో నువ్వు చాలా స్ట్రాంగ్‌ అంటూ సన్నీ పగలబడిన నవ్వి అక్కడ నుండి వెళ్ళిపోయింది. ఆ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయగా వైరల్‌ అయ్యింది. సన్నీ అభిమానులు ఆమె నవ్వు.. తన అందాన్ని పొగుడుతూ కామెంట్స్ చేస్తూ షేర్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Sunny Leone (@sunnyleone)