Unstoppable: ఈ సాయంత్రం సూపర్ ఎంజాయ్‌మెంట్.. బాలయ్యతో మహేష్!

నందమూరి నటసింహం బాలయ్య మేనియా కొనసాగిస్తున్నాడు. ఒకవైపు అఖండ సినిమా బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంటే.. బాలయ్య డిజిటల్ లో హవా చూపిస్తున్నాడు.

Unstoppable: ఈ సాయంత్రం సూపర్ ఎంజాయ్‌మెంట్.. బాలయ్యతో మహేష్!

Unstoppable

Unstoppable: నందమూరి నటసింహం బాలయ్య మేనియా కొనసాగిస్తున్నాడు. ఒకవైపు అఖండ సినిమా బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంటే.. బాలయ్య డిజిటల్ లో హవా చూపిస్తున్నాడు. అచ్చ తెలుగు పాపులర్ ఓటీటీ ‘ఆహా’లో Unstoppable షో తో ఎండ్‌లెస్ అండ్ ఎనర్జిటిక్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తున్న బాలయ్య సర్జరీ తరువాత మళ్ళీ కమ్ బ్యాక్ ఇచ్చి కామెడీ కింగ్ బ్రహ్మానందం, దర్శకుడు అనిల్ రావిపూడితో మూడవ ఎపిసోడ్ చేశాడు.

Bigg Boss 5: పింకీ ఔట్.. 91 రోజులు హౌస్‌లో చాలా గ్రేట్!

ఇక ఇప్పుడు నాలుగో ఎపిసోడ్ న బ్లాక్ బస్టర్ ఎపిసోడ్ గా సిద్ధం చేశారు. అది కూడా మహేష్ లాంటి సూపర్ స్టార్ తో ఈ ఎపిసోడ్ కావడంతో ఇప్పుడు టాక్ అఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అలా మహేష్ బాలయ్య షోకి వెళ్ళాడో లేదో ఫొటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి. డిసెంబర్ 5న ఆదివారం ఈ ఎపిసోడ్ షూట్ కూడా పూర్తి చేయగా త్వరలోనే బ్లాక్ బస్టర్ ప్రోమో వదలనున్నారు.

Sharwanand: జై బాలయ్య.. లక్ష్య ప్రీ రిలీజ్ వేడుకలో శర్వా కామెంట్స్!

షూటింగ్ తర్వాత మహేష్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా అది కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ సాయంత్రం నందమూరి బాలకృష్ణ గారితో అన్ స్టాప్పబుల్ తో షో చేశానంటూ ఇద్దరి ఫోటోని కలిపి తన ఇన్స్టా స్టోరీ లో షేర్ చేయడంతో ఇద్దరి హీరోల అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇక, బాలకృష్ణ, మహేష్ బాబు కలిసి ఓ టాక్ షోలో కనిపించడం ఇదే తొలిసారి కాగా వీరిద్దరి మధ్య ఫన్ ఎలా ఉండబోతోందనే విషయం ఆసక్తికరంగా మారింది.