Bigg Boss 5: పింకీ ఔట్.. 91 రోజులు హౌస్‌లో చాలా గ్రేట్!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 చివరి దశకు వచ్చేసింది. మరో రెండు వారాల్లో షో ముగియనుంది. ఆదివారం మరొకరు ఎలిమినేషన్ కావడంతో సరిగ్గా రెండు వారాలతో ఈ షో లాస్ట్ ఎపిసోడ్ కి చేరనుంది.

Bigg Boss 5: పింకీ ఔట్.. 91 రోజులు హౌస్‌లో చాలా గ్రేట్!

Bigg Boss 5

Bigg Boss 5: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 చివరి దశకు వచ్చేసింది. మరో రెండు వారాల్లో షో ముగియనుంది. ఆదివారం మరొకరు ఎలిమినేషన్ కావడంతో సరిగ్గా రెండు వారాలతో ఈ షో లాస్ట్ ఎపిసోడ్ కి చేరనుంది. ఎప్పటిలాగానే ముందే అనుకున్నట్లుగానే ఈ వారం ప్రియాంకా సింగ్ ఇంటి నుండి బయటకి వచ్చేసింది. ఈ వారం ఎలిమినేషన్ నామినేషన్స్ లో ఉన్న వాళ్ళలో పింకీకి తక్కువ ఓట్లు రావడంతో ఆమెని ఎలిమినేట్ చేస్తున్నట్లుగా హోస్ట్ నాగ్ వెల్లడించాడు.

Sharwanand: జై బాలయ్య.. లక్ష్య ప్రీ రిలీజ్ వేడుకలో శర్వా కామెంట్స్!

ఇక.. పింకీ విషయానికి వస్తే మొత్తం 91 రోజులు ఆమె ఇంట్లో ఉండడం సాధారణ విషయం కాదనే చెప్పుకోవాలి. ఎందుకంటే మిగతా వాళ్ళతో పోల్చితే ఏ మాత్రం ఫాలోయింగ్ లేని కంటెస్టెంట్ పింకీ. అందుకే చాలాసార్లు ఆమె ఎలిమినేషన్‌ గురించి వార్తలు వచ్చాయి. కానీ పింకీ మాత్రం చివరి జర్నీదాకా చేరుకుంది. కానీ టాప్‌ 5లో మాత్రం చోటు దక్కించుకోలేకపోయింది. 13వ వారంలో నిష్క్రమించి ఈసారైనా ఒక ట్రాన్స్‌జెండర్‌ ఫినాలేలో అడుగుపెడుతుందేమోనన్న ఆశలను అడియాశలు చేసింది.

Bigg Boss 5: నో డౌట్ ఈరోజు పింకీ ఎలిమినేషన్ ఖాయం!

తమన్నా సింహాద్రి తర్వాత తెలుగు బిగ్‌బాస్‌లో అడుగుపెట్టిన రెండో ట్రాన్స్‌జెండర్‌గా నిలిచిన పింకీ.. తొలి నుండి ఇంట్లో మిగతా సభ్యులతో సాధ్యమైనంత వరకు గొడవలు లేకుండా ఎలిమినేషన్స్ నామినేషన్స్ కు దూరంగా ఉంటూ.. ఇంటి సభ్యుల అవసరాలను తీరుస్తూ.. ఆటపట్టిస్తూ.. వంటల పురుగులాగా కిచెన్ లో ఎక్కువ సమయాన్ని గడుపుతూ వచ్చింది. ఇక మానస్ మీద తన ఇష్టాన్ని ఓపెన్ గా చెప్పేసిన పింకీ ఎలిమినేషన్ సమయంలో కూడా బిగ్‌బాస్‌ షో నుంచి వెళ్లిపోతున్నానన్న బాధ కన్నా మానస్‌ దూరమవుతున్నాడన్న బాధే ఎక్కువగా ఉన్నట్లు కనిపించింది.