Balakrishna : మరోసారి బాలయ్య, తమన్ మాస్ బీట్.. జోడిగా ఖిలాడీ భామ

తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ షూటింగ్ లొకేషన్ కి వెళ్లి బాలయ్య బాబు, శేఖర్ మాస్టర్, గోపీచంద్ మలినేనితో సెల్ఫీ తీసుకొని పోస్ట్ చేశాడు. ఈ సినిమాకి............

Balakrishna : మరోసారి బాలయ్య, తమన్ మాస్ బీట్.. జోడిగా ఖిలాడీ భామ

Dimple Hayathi

Balakrishna :  ‘అఖండ’ లాంటి మాస్ బ్లాక్ బస్టర్ తర్వాత బాలకృష్ణ ప్రస్తుతం మరో మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇటీవలే సిరిసిల్లలో షూటింగ్ చేసుకుంది ఈ సినిమా. ప్రస్తుతం రెండో షెడ్యూల్ షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతుంది.

తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ షూటింగ్ లొకేషన్ కి వెళ్లి బాలయ్య బాబు, శేఖర్ మాస్టర్, గోపీచంద్ మలినేనితో సెల్ఫీ తీసుకొని పోస్ట్ చేశాడు. ఈ సినిమాకి కూడా తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్రస్తుతం తమన్ మ్యూజిక్ లో స్వరపరచిన ఓ మాస్ సాంగ్ ని రామోజీ ఫిలింసిటీలో శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ పాట స్పెషల్ సాంగ్ అని, ఇందులో ఖిలాడీ భామ డింపుల్ హయతి బాలయ్యతో కలిసి స్టెప్పులేయబోతున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాలో బాలయ్యకి ప్రతి నాయకుడిగా కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ నటిస్తున్నాడు.

Cannes 2022 : కాన్స్ చిత్రోత్సవంలో మన భారత తారలు

తమన్ ఈ ఫోటో షేర్ చేయడంతో మరోసారి బాలయ్య బాబుకి తమన్ అఖండ లాంటి మాస్ బీట్స్ ఇవ్వనున్నాడని, ఈ సారి కూడా థియేటర్ సౌండ్ బాక్సులు బద్దలవ్వాల్సిందే అంటున్నారు అభిమానులు.