Tamil Directors : తెలుగులోకి తమిళ డైరెక్టర్ల రాక..
తెలుగు స్టార్ హీరోలు టాప్ డైరెక్టర్లు మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నారు. ప్రాజెక్టులు సెట్ చేస్తున్నారు. పెద్ద డైరెక్టర్ కోసం స్టార్ లు, స్టార్ ల కోసం పెద్ద డైరెక్టర్లు వెయిట్ చేస్తున్నారు. దీంతో మనకి ఎలాగూ తెలుగు టాప్ డైరెక్టర్లు దొరకరని ఫిక్సయిన యంగ్ హీరోస్.......

Tamil Directors : తెలుగు స్టార్ హీరోలు టాప్ డైరెక్టర్లు మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నారు. ప్రాజెక్టులు సెట్ చేస్తున్నారు. పెద్ద డైరెక్టర్ కోసం స్టార్ లు, స్టార్ ల కోసం పెద్ద డైరెక్టర్లు వెయిట్ చేస్తున్నారు. దీంతో మనకి ఎలాగూ తెలుగు టాప్ డైరెక్టర్లు దొరకరని ఫిక్సయిన యంగ్ హీరోస్ పక్క రాష్ట్రాల నుంచి దర్శకుల్ని దిగుమతి చేసుకుంటున్నారు.
ట్రిపుల్ ఆర్ తో పాన్ ఇండియా సక్సెస్ కొట్టిన రామ్ చరణ్ తేజ్ ఆ తర్వాత ఆచార్య తో ఫ్యాన్స్ ను నిరాశ పరిచారు. ప్రస్తుతం భారీ కమర్షియల్ సినిమాల దర్శకుడు శంకర్ తో తన 15వ సినిమా చేస్తూ బిగ్ సక్సెస్ కోసం ఫ్యాన్స్ ను ఊరిస్తున్నారు. ఈ సినిమాను తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తోంది.
మరో తమిళ డైరెక్టర్ లింగుస్వామితో ‘ది వారియర్’ అని భారీ బైలింగ్వల్ సినిమా చేస్తున్నాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్. ఇందులో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ప్రచార చిత్రాలకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.
Pooja hegde : బాలీవుడ్ లో కూడా హిట్ కోడతనంటున్న బుట్టబొమ్మ..
వరస సక్సెస్ లతో దూసుకెళ్తోన్న నాగచైతన్య థాంక్యూ మూవీతో మరో మంచి లవ్ స్టోరీని రిపీట్ చేయబోతున్నారు విక్రమ్ కె కుమార్. ఆల్రెడీ రిలీజ్ అయిన టీజర్ ఈ సినిమా పైన మరింత ఆసక్తి పెంచింది. థాంక్యూ సినిమా ఇంకా రిలీజ్ కాకుండానే చైతూ దూత అనే వెబ్ సిరీస్ పట్టాలెక్కించారు. ఇప్పుడు తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభుతో నాగచైతన్య 22వ సినిమా వర్క్స్ స్టార్ట్స్ చేసి, అక్కినేని ఫ్యాన్స్ ను ఖుషి చేస్తున్నారు. ఈ సినిమాకు మ్యాస్ట్రో ఇళయరాజాతో పాటు, యువన్ శంకర్ రాజా సంగీతం అందించడం విశేషం. ఇందులో కూడా కృతిశెట్టినే హీరోయిన్.
ఒకప్పుడు తెలుగు, తమిళ్, కన్నడ ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న యాక్షన్ కింగ్ అర్జున్ నిర్మాతగానూ, దర్శకుడిగానూ పలు సినిమాలు తెరకెక్కించారు. ఇప్పుడు దర్శకుడిగా మారి తెలుగులో విశ్వక్ సేన్ హీరోగా, ఐశ్వర్య హీరోయిన్ గా కొత్త సినిమా నిర్మిస్తున్నారు. ఆ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్ లో వైభవంగా జరిగింది. పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, రాఘవేంద్రరావు ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేశారు.
ఇక రామ్ చరణ్ తో తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ సినిమా కూడా త్వరలోనే ఉండబోతుంది. ఇప్పటికే మైత్రి నిర్మాణ సంస్థ లోకేష్ కి అడ్వాన్స్ కూడా ఇచ్చేశారు. మరో తమిళ దర్శకుడు అట్లీ ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా తమిళ దర్శకులంతా తెలుగు హీరోలతో సినిమాలని లైన్ లో పెట్టి రెండు చోట్ల మార్కెట్ క్రియేట్ చేసుకుంటున్నారు.
- Vikram: ఓటీటీలోకి వచ్చేస్తున్న విక్రమ్.. రిలీజ్ డేట్ ఫిక్స్!
- Movies : లైగర్ వచ్చేదాకా మార్కెట్ అంతా మీడియం, చిన్న సినిమాలదే..
- Lokesh Kanagaraj: విజయ్ కోసం మకాం అక్కడికి మారుస్తున్న లోకేశ్..?
- Ram Charan: మళ్లీ అమృత్సర్ చెక్కేస్తున్న చరణ్.. ఈసారి దేనికో తెలుసా?
- చైతూ-కృతిశెట్టి కాంబో రెండోసారి.. పూజా కార్యక్రమాలతో మొదలైన NC22..
1Booster Dose: కొవిడ్ బూస్టర్ డోస్ గ్యాప్‌ను 6నెలలకు తగ్గించిన ప్రభుత్వం
2Diginal India Scam : వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో ఘరానా మోసం.. రూ.30కోట్లతో జంప్
3Heavy rain: రేపు ఆ ఆరు జిల్లాల్లో అతిభారీ వర్షాలు పడే అవకాశం..
4Smriti Irani: స్మృతి ఇరానీ, జ్యోతిరాధిత్యాకు అదనపు శాఖలు
5London: బ్రిటన్‌లో రాజకీయ సంక్షోభం.. ప్రధాని బోరిస్‌కు షాకిచ్చిన మరో ఐదుగురు మంత్రులు..
6Pragya Jaiswal: అందాలతో ఫిదా చేస్తున్న ప్రగ్యా జైస్వాల్
7Rajya Sabha: రాజ్యసభకు ఇళయరాజా, విజయేంద్ర ప్రసాద్.. మరో ఇద్దరు దక్షిణాది వారికి చోటు
8Telangana Covid Figure : తెలంగాణలో కరోనా కల్లోలం.. భారీగా పెరిగిన కేసులు
9Nagarjuna: ఎలక్ట్రిఫైయింగ్ అప్డేట్తో వస్తున్న ‘ది ఘోస్ట్’!
10Udaipur Kanhaiya Lal Case : ఉదయ్‌పూర్ టైలర్ హత్య కేసు.. నిందితులకు హైదరాబాద్‌తో లింకులు
-
ICC Test Rankings : టాప్ 10లో చోటు కోల్పోయిన కోహ్లీ.. ఆరేళ్లలో ఇదే ఫస్ట్ టైం..!
-
MacBook Air M2 : అదిరే ఫీచర్లతో ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M2.. ప్రీ-ఆర్డర్లు ఎప్పుటినుంచంటే?
-
Agent: ఏజెంట్‌ను మళ్లీ వెనక్కి నెడుతున్నారా..?
-
Liger: లైగర్ @ 50 డేస్.. సందడి షురూ చేసిన పూరీ
-
Samsung Galaxy M13 : శాంసంగ్ గెలాక్సీ M13 5G ఫోన్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంత ఉండొచ్చుంటే?
-
Sohail: లక్కీ లక్ష్మణ్ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
-
NBK107: దేశం మారుస్తున్న బాలయ్య.. ఎందుకో తెలుసా?
-
Hangover : హ్యాంగోవర్ ను తగ్గించే తేనె!