Ram Charan : నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది చరణ్.. హీరో సూర్య!

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల అమెరికాలో అరుదైన గౌరవాన్ని అందుకుంటున్న సంగతి తెలిసిందే. దీంతో పలువురు ప్రముఖులు రామ్ చరణ్ ని అభినందిస్తున్నారు. తాజాగా తమిళ హీరో సూర్య కూడా చరణ్ ని అభినందిస్తూ ట్వీట్ చేశాడు.

Ram Charan : నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది చరణ్.. హీరో సూర్య!

tamil hero suriya and anand mahindra tweet on ram charan

Ram Charan : రాజమౌళి తెరకెక్కించిన RRR చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎంతటి విజయాన్ని అందుకుందో మనందరికీ తెలుసు. ఇక ఈ సినిమాలో నటించిన ఎన్టీఆర్, రామ్ చరణ్ లు గ్లోబల్ వైడ్ పాపులారిటీని సంపాదించుకున్నారు. ఇక ఇటీవల ఆస్కార్ మరియు హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ (HCA) అవార్డుల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన రామ్ చరణ్ అక్కడ అరుదైన గౌరవాన్ని అందుకుంటున్నాడు. ఈ క్రమంలోనే యూఎస్ లోని పాపులర్ టాక్ షో గుడ్ మార్నింగ్ అమెరికా కి గెస్ట్ గా వెళ్లి రికార్డు సృష్టించగా, హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో కూడా ప్రజెంటర్ గా వ్యవహరించాడు. ఈ ఘనతలు అందుకున్న మొదటి ఇండియన్ సెలెబ్రిటీ రామ్ చరణ్ కావడంతో సినీ మరియు దేశంలోని పలువురు ప్రముఖులు రామ్ చరణ్ ని అభినందిస్తున్నారు.

Upasana : అమెరికన్ ఫేమస్ డాక్టర్‌ని అపోలో హాస్పిటల్‌లో జాయిన్ అవ్వమంటున్న ఉపాసన.. ఎందుకు?

ఈ క్రమంలోనే అపోలో మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డి, చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభినందించగా.. తాజాగా తమిళ హీరో సూర్య కూడా చరణ్ ని అభినందిస్తూ ట్వీట్ చేశాడు. “HCA అవార్డ్స్ ని అందుకున్నందుకు RRR టీంకి నా అభినందనలు. మీరు పడిన శ్రమకు గాను ప్రపంచవ్యాప్త గుర్తింపుకు అర్హులు. ఇక ఇంటర్నేషనల్ స్టేజి పై మన దేశాన్ని రిప్రజెంట్ చేస్తున్న నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది రామ్ చరణ్” అంటూ ట్వీట్ చేశాడు. అలాగే ప్రముఖ బిజినెస్ మ్యాన్ ఆనంద్ మహీంద్రా.. “రామ్ చరణ్ ఒక గ్లోబల్ స్టార్” అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

కాగా HCA అవార్డ్స్ RRR మూవీ ఏకంగా 5 అవార్డులను కైవసం చేసుకుంది. ‘బెస్ట్‌ స్టంట్స్‌’, ‘బెస్ట్‌ యాక్షన్‌ మూవీ’, ‘బెస్ట్‌ ఒరిజినల్ సాంగ్‌’(నాటు నాటు), ‘బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్’ ‘స్పాట్ లైట్’ అవార్డుతో కలిపి మోత 5 అవార్డులు అందుకొని సంచలనం సృష్టించింది. మర్చి 13న ఆస్కార్ అవార్డుల పురస్కారం కూడా జరగనుంది. నాటు నాటు సాంగ్ తో నామినేషన్స్ లో ఉన్న RRR ఆస్కార్ అందుకుంటుందా? లేదా? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.