వారాణాసిలో ఇస్మార్ట్ శంకర్

ఇస్మార్ట్ శంకర్ యూనిట్ ప్రస్తుతం వారణాసిలో ల్యాండ్ అయ్యింది. అక్కడ ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ షూట్ చెయ్యబోతున్నారు..

  • Published By: sekhar ,Published On : April 30, 2019 / 10:17 AM IST
వారాణాసిలో ఇస్మార్ట్ శంకర్

ఇస్మార్ట్ శంకర్ యూనిట్ ప్రస్తుతం వారణాసిలో ల్యాండ్ అయ్యింది. అక్కడ ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ షూట్ చెయ్యబోతున్నారు..

ఎనర్జిటిక్ స్టార్ రామ్, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌‌ల కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్, ఇస్మార్ట్ శంకర్.. (డబుల్ దిమాఖ్ హైదరాబాదీ).. భార్య లావణ్య సమర్పణలో, పూరి టూరింగ్ టాకీస్ బ్యానర్‌పై, చార్మీతో కలిసి, ఓన్ డైరెక్షన్‌లో పూరి, ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్, ఇద్దరు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేస్తున్నాడు.. నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్స్‌గా నటిస్తున్నరు. పూరీ స్టైల్‌లోనే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుందీ సినిమా.
Also Read : చైతూ సినిమాలో ‘RX 100’ హీరో!

ఇస్మార్ట్ శంకర్ యూనిట్ ప్రస్తుతం వారణాసిలో ల్యాండ్ అయ్యింది. అక్కడ ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ షూట్ చెయ్యబోతున్నారు. వారణాసిలో ఫైట్ షూట్ చెయ్యబోతున్నామని చార్మీ ట్విట్టర్‌లో వీడియో పోస్ట్ చేసింది. ఈ మూవీకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నాడు.