నారప్ప.. సంక్రాంతి పోస్టర్ అదిరింది..

10TV Telugu News

తమిళంలో ధనుష్ హీరోగా నటించి హిట్ అయిన ‘అసురన్’ సినిమా తెలుగులో ఇప్పుడు నారప్ప పేరుతో రీమేక్ అవుతుంది. విక్టరీ వెంకటేష్ హీరోగా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్‌లుక్‌ను చిత్రయూనిట్ లేటెస్ట్‌గా విడుదల చేసింది.

త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్న ఈ సినిమాకు సంబంధించి సంక్రాంతి పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియమణి వెంకటేష్ భార్యగా నటిస్తోంది.

కలైపులి ఎస్ థాను సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా చాలా సహజంగా ఉండనుంది. సమాజంలోని కట్టుబాట్లను ప్రశ్నిస్తూ వచ్చిన ఈ సినిమా తమిళంలో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ఈ సినిమాకు సంబంధించి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ చిత్రయూనిట్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ పోస్టర్‌లో వెంకటేష్ భార్య పిల్లలతో సరదాగా ఉన్న సన్నివేశాన్ని చూపించారు. సమ్మర్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

×