టాలీవుడ్ నటుడు నర్సింగ్ యాదవ్ కన్నుమూత

టాలీవుడ్ నటుడు నర్సింగ్ యాదవ్ కన్నుమూత

Telugu Actor Narsing Yadav Died : ప్రముఖ సినీ నటుడు నర్సింగ్ యాదవ్ కన్నమూశారు. అనారోగ్యంతో యశోద ఆసుపత్రిలో చేరారు. 2020, డిసెంబర్ 31వ తేదీ గురువారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ…తుదిశ్వాస విడిచారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నర్సింగ్ యాదవ్ నటించారు. దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించిన ఈ నటుడు తన హావభావాలు, డైలాగ్స్ తో ప్రేక్షకులను అలరించారు. పలు చిత్రాల్లో విలన్ గా నటించి మెప్పించారు. విజయ నిర్మల దర్శక, నిర్మాణంలో వచ్చిన హేమాహేమీలు చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యారు.

గత 25 ఏళ్లుగా సినిమాలో నటిస్తున్నారు నర్సింగ్ యాదవ్. విలన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేశారాయన. క్షణక్షణం, గాయం లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాలో మంచి పాత్ర పోషించారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు ప్రముఖ నటుల చిత్రాల్లో సినిమాల్లో నర్సింగ్ నటించారు. తెలంగాణ యాసలో మాట్లాడుతూ…పాత్రలకు ప్రత్యేకత తీసుకొచ్చారు. మాస్టర్, ఇడియట్, జానీ, ఠాగూర్, చంద్రలేఖ, వర్షం, సై, అడవి రాముడు, డార్లింగ్, శంకర్ దాదా ఎంబీబీఎస్, మాస్ ఇలా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు ఈ నర్సింగ్ యాదవ్. ఈయన మృతిపై సినీ, రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు సంతాపం తెలియచేశారు.