Salman Khan: సల్లూ భాయ్‌ని వాడేసుకుంటున్న తెలుగు హీరోలు!

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాడని మీడియాలో తెగ హడావిడి జరగుతోంది. అయితే అది ఒక్కటి కాదు.. రెండు సినిమాలని మరో టాక్ నడుస్తోంది.

Salman Khan: సల్లూ భాయ్‌ని వాడేసుకుంటున్న తెలుగు హీరోలు!

Salman Khan

Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాడని మీడియాలో తెగ హడావిడి జరగుతోంది. అయితే అది ఒక్కటి కాదు.. రెండు సినిమాలని మరో టాక్ నడుస్తోంది. మన పాన్ ఇండియా సినిమాలకు బాలీవుడ్ స్టార్ ని తెగ వాడేసుకొనేందుకు మన హీరోలు ఫిక్సయ్యారని టాక్. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అన్తిమ్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్, తనబావ ఆయుష్ శర్మతో కలిసి చేసి కాప్ యాక్షన్ఎంటర టైనర్ అన్తిమ్ మూవీ నవంబర్ 26న రిలీజ్ అయ్యి మంచి హిట్ అందుకుంది.

Akhanda: బాలయ్య మాస్ జాతర.. హ్యాట్రిక్ సక్సెస్‌తో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్

ఆ హిట్ కి ఆడియన్స్ కి థాంక్స్ చెప్పడానికి హైదరాబాద్ వచ్చిన సల్మాన్.. హైదరాబాద్ బిర్యానీ తిని, ఓపిగ్గా మాట్లాడి మరీ ఫాన్స్ ని ఫుల్ ఖుష్ చేశారు సల్మాన్. అంతేకాదు తన టాలీవుడ్ ఎంట్రీ మీద ఆడియన్స్ కి ఇంట్రస్టింగ్ న్యూస్ చెప్పారు. టాప్ స్టార్ సల్మాన్ ఖాన్ ని మన హీరోలు కూడా బాగా వాడేస్తున్నారు. ఈమధ్య తెలుగులో అన్నీ పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కడంతో.. బాలీవుడ్ లో ప్రమోషన్ కోసం, అక్కడ మార్కెట్ కోసం సల్మాన్ ని అప్రోచ్ అవుతున్నారు.

Sonakshi Sinha: మతులు పోగొడుతున్న బొద్దుగుమ్మ సోనాక్షి

తెలుగులో మెగా ఫ్యామిలీలో చిరంజీవి, చరణ్ తో మంచి టచ్ ఉన్న సల్మాన్ ఖాన్ ని.. గాడ్ ఫాదర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. మోహన్ రాజా డైరెక్షన్లో తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ మూవీలో చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు సల్మాన్ ఖాన్. విక్టరీ వెంకటేష్ తో కూడా మరో సినిమాలో నటించనున్నాడు ఈ కండల వీరుడు. స్వయంగా సల్మాన్ ఈ విషయాన్ని చెప్పాడు. అంతేకాదు.. బన్నీ పుష్ప సినిమాకి కూడా బాలీవుడ్ లో సల్మాన్ చేత ప్రమోట్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు పుష్ప టీమ్.

RRR: జనవరి 7 విడుదల.. బాహుబలి కోటను బద్దలు కొట్టగలరా?

ఇలా ఆల్ ఓవర్ ఇండియా మార్కెట్ కోసం బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హెల్ప్ తీసుకుంటున్నారు మన స్టార్ హీరోలు. సల్మాన్ ఖాన్ కూడా తెలుగులో మంచి మార్కెట్ సంపాదించుకుంటూ టాలీవుడ్ కి దగ్గరవుతున్నారు. చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ సినిమాలో సల్మాన్ పాత్రపై కొంత ఊహాగానాలున్నా.. వెంకటేష్ తో ఏ సినిమాలో నటిస్తున్నాడో ఇంకా క్లారిటీ రాలేదు. త్వరలోనే దీనిపై కూడా క్లారిటీ రానుంది.