సందీప్ కిషన్ న్యూ మూవీ లేటెస్ట్ అప్డేట్!

సందీప్ కిషన్ న్యూ మూవీ లేటెస్ట్ అప్డేట్!

సందీప్ కిష‌న్, హ‌న్సిక జంటగా న‌టిస్తున్న కొత్త మూవీ ‘తెనాలి రామ‌కృష్ణ బీఏ బీఎల్‌’. ఈ సినిమాను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు జి నాగేశ్వ‌ర‌రెడ్డి తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళంలో ఏక కాలంలో రూపొందిస్తున్నారు. ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ ను తెలుగు, త‌మిళంలో మే 7న విడుద‌ల చేయ‌నున్నారు.  
Also Read : మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఎదురుచూస్తున్నా ఫ్యాన్స్!

ఇక ఈ చిత్రం షూటింగ్ విషయానికి వస్తే 60 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. త‌మిళ న‌టి వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ ఈ సినిమాతో తెలుగు సినిమాలోకి ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ముర‌ళీ శ‌ర్మ‌, బ్ర‌హ్మానందం, వెన్నెల కిశోర్, పృథ్వి, ర‌ఘు బాబు, స‌ప్త‌గిరి, కిన్నెర త‌దితరులు ఇత‌ర కీలక పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

ఈ సినిమాకు సాయికార్తీక్ సంగీతాన్ని అందిస్తుండగా.. సాయి శ్రీరామ్ కెమెరామేన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. శ్రీ నీల‌కంఠేశ్వ‌ర స్వామి క్రియేష‌న్స్ ప‌తాకంపై ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. సందీప్ కిష‌న్‌తో హన్సిక న‌టించబోయే తొలి సినిమా ఇదే కావడం విషేశం.   
Also Read : సల్మాన్ ‘దబాంగ్ 3’ రిలీజ్ డేట్ ఫిక్స్!