Thaman : నా భార్యతో కలిసి స్టేజి షోలు చేయాలి.. చిరకాల కోరికని బయటపెట్టిన తమన్.. |Thaman says about his dream

Thaman : నా భార్యతో కలిసి స్టేజి షోలు చేయాలి.. చిరకాల కోరికని బయటపెట్టిన తమన్..

తమన్ మాట్లాడుతూ.. ''వర్ధిని వాయిస్ బాగుంటుందని డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌లకు అనిపిస్తే పాడిస్తారు. ఎప్పటికైనా భవిష్యత్తులో ఆమెతో కలిసి స్టేజ్‌ షోలు చేయాలని ఉంది. కానీ................

Thaman :  నా భార్యతో కలిసి స్టేజి షోలు చేయాలి.. చిరకాల కోరికని బయటపెట్టిన తమన్..

Thaman :  ప్రస్తుతం టాలీవుడ్ లో ఫామ్ లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే తమన్ అని తడుముకోకుండా ఎవరైనా చెప్పేస్తారు. గత రెండేళ్లుగా అందరూ కరోనాతో కష్టాల్లో ఉంటే తమన్ మాత్రం తన మ్యూజిక్ తో అందర్నీ అలరిస్తూ రికార్డులు సృష్టిస్తున్నాడు. తమన్ ఫుల్ బిజీగా, ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. స్టార్ హీరోల సినిమాలన్నీ అతని చేతిలోనే ఉన్నాయి. అతను చేసిన ప్రతి సినిమా మ్యూజికల్ గా హిట్ అవుతూనే ఉంది. దీంతో టాలీవుడ్ లో తమన్ కి డిమాండ్ బాగా పెరిగింది. ఇటీవలే సర్కారు వారి పాట సినిమాతో అదిరిపోయే సాంగ్స్ ఇచ్చాడు.

తమన్ చాలా అరుదుగా తన భార్య, పిల్లల గురించి చెప్తాడు. తమన్ ప్లే బ్యాక్ సింగర్‌ శ్రీ వర్ధినిని వివాహం చేసుకున్నాడు. ఆమె గతంలో మణిశర్మ, యువన్‌ శంకర్‌ రాజా వద్ద కొన్ని పాటలు పాడింది. తమన్‌ మ్యూజిక్ డైరెక్షన్‌లో కూడా నాలుగు పాటలు పాడింది. ప్రస్తుతం సర్కారు వారి పాట సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న తమన్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన చిరకాల కోరికని బయట పెట్టాడు.

KCR : కేసీఆర్‌ని కలిసిన తమిళ స్టార్ హీరో విజయ్

తమన్ మాట్లాడుతూ.. ”వర్ధిని వాయిస్ బాగుంటుందని డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌లకు అనిపిస్తే పాడిస్తారు. ఎప్పటికైనా భవిష్యత్తులో ఆమెతో కలిసి స్టేజ్‌ షోలు చేయాలని ఉంది. కానీ దానికన్నా ముందు ఆమె రెండు మూడు సూపర్‌ హిట్ పాటలను అయినా పాడాలి” అని తెలిపాడు. ఇక తన కొడుకు గురించి చెబుతూ.. ”నా ట్యూన్‌లను ఫస్ట్ విని తానే అభిప్రాయం చెప్తాడు. మ్యూజిక్‌కు సంబంధించిన పరికరాలను వాడటంలో మంచి పట్టు ఉంది. పియానోలో అప్పుడే నాలుగో గ్రేడ్‌ పూర్తి చేశాడు. భవిష్యత్తులో ఏ కెరీర్ తీసుకుంటాడో తెలీదు” అని తమన్‌ చెప్పాడు. మరి తమన్ తన భార్యతో కలిసి స్టేజి షోలు ఎప్పుడు చేస్తాడో చూడాలి.

×