Raj : టాలీవుడ్ లో తీవ్ర విషాదం.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కన్నుమూత..

తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూశారు. ప్రముఖ సంగీత దర్శకుకుడు రాజ్ కొద్దిసేపటి క్రితమే మరణించారు. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది.

Raj : టాలీవుడ్ లో తీవ్ర విషాదం.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కన్నుమూత..

Tollywood Famous Music Director Raj Passes Away

Music Director Raj : ఇటీవల టాలీవుడ్(Tollywood) లో వరుస విషాదాలు చోటుకి చేసుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు(Music Director) కన్నుమూశారు. ప్రముఖ సంగీత దర్శకుకుడు రాజ్(Raj) కొద్దిసేపటి క్రితమే మరణించారు. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. రాజ్ – కోటి సంగీత ద్వయం టాలీవుడ్ లో చాలా పాపులర్. రాజ్ పూర్తి పేరు తోటకూర సోమరాజు.

మరో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కోటి తో కలిసి రాజ్ దాదాపు 180 సినిమాలకు సంగీతం అందించారు. తెలుగులో రాజ్ – కోటి ద్వయం సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరూ కలిసి సంగీతం అందించిన చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక పాటలు అయితే ఇప్పటికీ వింటారు. రాజ్ – కోటి పేరు 90వ దశకంలో టాలీవుడ్ లో మారుమ్రోగిపోయింది.

అయితే కొన్నేళ్ల క్రితం కోటి – రాజ్ మధ్య మనస్పర్థలు రావడంతో వీరిద్దరూ విడిపోయారు. వీరు విడిపోయాక ఎక్కువగా సినిమాలు చేయలేదు. గత కొంతకాలంగా రాజ్ సినిమాలకు దూరంగానే ఉంటున్నారు. కోటితో కాకుండా రాజ్ సింగిల్ గా సిసింద్రీ, రాముడొచ్చాడు, ప్రేమంటే ఇదేరా.. లాంటి పలు సూపర్ హిట్ సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజ్ కొద్దిసేపటి క్రితమే గుండెపోటుతో హైదరాబాద్ లోని తన స్వగృహంలో కన్నుమూశారు. దీంతో సినీ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలుపుతున్నారు. ఆయనకు నివాళులు అర్పించేందుకు రాజ్ ఇంటికి వెళ్తున్నారు. రాజ్ తండ్రి టీవీ రాజు కూడా సంగీత దర్శకులే.

Thalapathy68 : తలపతి విజయ్ నెక్స్ట్ సినిమా ఫిక్స్.. కస్టడీ డైరెక్టర్ తోనే..

రాజ్ – కోటిలను విడిపోయాక కలపాలని చాలా మంది చూశారు. మెగాస్టార్, బాలసుబ్రహ్మణ్యం కూడా వీరిద్దర్నీ కలపడానికి ట్రై చేశారు. కానీ వీరు కలవలేదు. రాజ్ చివరిసారిగా ఇటీవలే బేబీ సినిమాలోని ఓ సాంగ్ లాంచ్ కి విచ్చేశారు. దీంట్లో చాలా సంవత్సరాల తర్వాత కోటి పక్కన కూర్చొని కనిపించారు.