‘శుభ్రపర్చాల్సిన టైమ్ వచ్చింది’.. విజయ్ ఈజీగా వదిలేలా లేడు..

విజయ్ దేవరకొండకు పలువురు సినీ ప్రముఖులు మద్దతు తెలుపుతున్నారు..

  • Published By: sekhar ,Published On : May 4, 2020 / 05:43 PM IST
‘శుభ్రపర్చాల్సిన టైమ్ వచ్చింది’.. విజయ్ ఈజీగా వదిలేలా లేడు..

విజయ్ దేవరకొండకు పలువురు సినీ ప్రముఖులు మద్దతు తెలుపుతున్నారు..

క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ రిలీజ్ చేసిన వీడియో ఇప్పుడు మీడియా, సోషల్ మీడియా మరియు ఫిలిం వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కొన్ని వెబ్‌సైట్లకు చెందిన వ్యక్తులు తనపై కావాలనే అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని చెప్పిన విజయ్.. కరోనా సంక్షోభంలో తను చేస్తున్న సేవలపై ఆ వెబ్‌సైట్లు ప్రచురించిన తప్పుడు కథనాలపై ఫైర్ అయ్యాడు. ఇటువంటి ఫేస్‌న్యూస్‌ల వల్ల తను మాత్రమే కాదు.. సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటీనటులు అందరూ బాధపడుతున్నారని అతను పేర్కొన్నాడు.

అయితే ఈ విషయంలో విజయ్ దేవరకొండకి.. సూపర్‌స్టార్ మహేశ్ బాబుతో మొదలైన మద్దతు అంతకంతకు పెరుగుతూ పోతుంది. మాస్ మహరాజ్ రవితేజ, రానా, దర్శకులు కొరటాల శివ, అనిల్ రావిపూడి, హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి, క్రిష్ జాగర్లమూడి, మధుర శ్రీధర్, శివ నిర్వాణ, బీవీఎస్ రవి, రాశీ ఖన్నా, అనిల్ సుంకర తదితరులు దేవరకొండకు మద్దతుగా నిలిచారు.