Multi Starrer Movies : భారీ హైప్ సినిమాలు.. ఏం చేస్తారో మరి..?

టాలీవుడ్‌లో ఎప్పుడూ లేనన్ని మల్టీస్టారర్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. స్పెషల్లీ టాప్ స్టార్ కాంబినేషన్స్ ఉంటే ఆ కిక్కే వేరు..

Multi Starrer Movies : భారీ హైప్ సినిమాలు.. ఏం చేస్తారో మరి..?

Multi Starrer Movies

Multi Starrer Movies: ఒక్క హీరో ఉంటేనే బడ్జెట్, కలెక్షన్లు, క్రేజ్, హైప్, ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఓ రేంజ్‌లో ఉంటాయ్. అలాంటిది ఇద్దరు టాప్ హీరోలు కలిసి సినిమాలు చేస్తే.. అది వేరే లెవల్‌లో ఉంటుందనడంలో ఏమాత్రం డౌట్ లేదు. లేటెస్ట్‌‌గా టాలీవుడ్‌లో అలాంటి టాప్ స్టార్ కాంబినేషన్స్ రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. మరి ఏ హీరో కాంబినేషన్‌కి ఎక్కువ క్రేజ్ ఉందో, ఏ సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయో లెట్స్ హ్యావ్ ఎ లుక్.

Radhika Sarathkumar : వెంకీ మామతో లంచ్ అండ్ లాఫ్..

టాలీవుడ్‌లో ఎప్పుడూ లేనన్ని మల్టీస్టారర్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. స్పెషల్లీ టాప్ స్టార్ కాంబినేషన్స్ ఉంటే ఆ కిక్కే వేరు. ప్రజెంట్ తెలుగు సినిమా ఆడియన్స్‌‌కి అలాంటి కిక్ ఫుల్‌గా దొరకబోతోంది. పవన్ కళ్యాణ్, రానా లీడ్ రోల్స్‌లో సాగర్ చంద్ర డైరెక్షన్లో తెరకెక్కుతున్న ‘భీమ్లా నాయక్’ సినిమాలో ఇద్దరు హీరోల్ని పోటాపోటీగా చూపిస్తున్నారు మేకర్స్. ఆమధ్య రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ లుక్ సోషల్ మీడియాలో రికార్డులు క్రియేట్ చేస్తే.. లేటెస్ట్‌గా రిలీజ్ అయిన ‘డానియెల్ శేఖర్‌’ గా రానా వీడియో అంతకుమించి రెస్పాన్స్ సంపాదిస్తోంది.

Bheemla Nayak : నీ మొగుడు ‘గబ్బర్ సింగ్’ అంట..! రానా దగ్గుబాటి డైలాగ్ ప్రోమో

జనరల్‌గా ఇద్దరు స్టార్ హీరోలు కలిసి సినిమాలో పనిచెయ్యాలంటే.. క్యారెక్టర్స్ వైజ్ ఇద్దరికీ సేమ్ ఇంపార్టెన్స్, స్పేస్ ఉండాలి. అది ఏమాత్రం అటూ ఇటైనా.. కథ వేరే రూట్లోకి వెళ్తుంది. అందుకే అలాంటి రిస్క్ చెయ్యడానికి పెద్దగా ఇష్టపడరు మేకర్స్. కానీ రాజమౌళి మాత్రం ఎన్టీఆర్, చరణ్ లాంటి టాప్ స్టార్ కాంబినేషన్‌ని సెట్ చేసి ట్రిపుల్ ఆర్ సినిమా చేశారు. కొమరం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా చరణ్ క్యారెక్టర్స్‌ని పవర్ ఫుల్‌‌గా తెరకెక్కించి రిలీజ్ రికార్డ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు.

RRR Movie : RRR మూవీ విడుదల వాయిదా.. రిలీజ్ ఎప్పుడంటే..?

సినిమాలో ఫుల్ ఫ్లెడ్జ్‌గా లేకపోయినా.. కొన్ని కొన్ని కాంబినేషన్స్‌ని చూస్తేనే పండగ చేసుకుంటారు ఫ్యాన్స్. అలాంటి టాప్ కాంబినేషన్ మెగాస్టార్ చిరంజీవి, చరణ్. ఈ తండ్రీ కొడుకులిద్దరూ జస్ట్ అలా ఒక్క సీన్‌లోనే కనిపిస్తేనే తెగ సంబరపడిపోయే ఫ్యాన్స్.. ఇద్దరూ కలిసి సినిమాలో మేజర్ రోల్ ప్లే చేస్తే ఆ కాంబినేషన్ సూపర్ హిట్టే. అలాంటి స్టార్ కాంబినేషన్‌ని సెట్ చేశారు కొరటాల. చిరంజీవి హీరోగా చేస్తున్న ‘ఆచార్య’ సినిమాలో చరణ్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ ఇద్దరి పోస్టర్లు రిలీజ్ చేస్తేనే పిచ్చెక్కి పోతున్న ఫ్యాన్స్‌కి ఫుల్ మూవీ చూస్తే పూనకాలే అంటున్నారు ‘ఆచార్య’ టీమ్.