Akhil: చుట్టూ ట్రైయాంగిల్ పోటీ.. 'ఏజెంట్' తట్టుకోగలడా? Triangle competition around the Akhil .. Can the 'agent' survive?

Akhil: చుట్టూ ట్రైయాంగిల్ పోటీ.. ‘ఏజెంట్’ తట్టుకోగలడా?

అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఏజెంట్’. ఇక ఈ సినిమాను స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తుండటంతో ఏజెంట్ మూవీపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Akhil: చుట్టూ ట్రైయాంగిల్ పోటీ.. ‘ఏజెంట్’ తట్టుకోగలడా?

Akhil: అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఏజెంట్’. ఇక ఈ సినిమాను స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తుండటంతో ఏజెంట్ మూవీపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా కోసం అఖిల్ భారీగా మేకోవర్ అవుతుండటంతో ఈ సినిమాలో ఆయన ఎలా కనిపిస్తాడా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు. ఈ సినిమాలో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సినిమా పనులు శరవేగంగా జరుగుతుండగా ఆగస్టు 12న భారీ స్థాయిలో విడుదల కానుంది.

Agent: అఖిల్ ఆశలన్నీ ఏజెంట్‌పైనే.. స్టార్ హీరో స్టేటస్ తెచ్చేనా?

అఖిల్ ను ఇండస్ట్రీలో స్టార్ హీరోగా నిలబెట్టాలని కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకూ డిఫరెంట్ డిఫరెంట్ డైరెక్టర్స్ ట్రై చేశారు కానీ ఆ టార్గెట్ ని రీచ్ కాలేకపోయారు ఆ డైరెక్టర్లు. అయితే ప్రజెంట్ ఆ చాన్స్ సురేందర్ రెడ్డి తీసుకున్నాడు. ఇప్పుడు వీళ్ల కాంబినేషన్ లో వస్తున్న ఏజెంట్ మీదే అఖిల్ ఆశలు పెట్టుకున్నాడు. అందుకు తగ్గట్లే మంచి టైం చూసి ఆగస్టులో ముహూర్తం పెట్టేశారు. కానీ.. ఇప్పుడు ఏజెంట్ చుట్టూ ట్రైయాంగిల్ పోటీ కనిపిస్తుంది. అదే వారం మరో మూడు సినిమాలు విడుదల కానున్నాయి.

Agent Movie : అఖిల్ కోసం స్టైలిష్ విలన్ గా మలయాళం సూపర్ స్టార్.. ‘ఏజెంట్’ విలన్ స్టైలిష్ లుక్ లీక్..

అఖిల్ కు ఇప్పుడు సొంత అన్న నాగ చైతన్యతో పాటు మాజీ వదిన సమంతా కూడా పోటీకి దిగాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అమిర్ ఖాన్ లో మూవీ.. నాగచైతన్య ప్రత్యేక పాత్రలో నటించిన లాల్ సింగ్ చద్దా కూడా ఏజెంట్ సినిమా విడుదలయ్యే వారాంతంలో విడుదల కాబోతుండగా.. తెలుగులో కూడా ఈ సినిమాపై మంచి క్రేజ్ ఉంది. ఇక సమంత సినిమా యశోద ఆగస్టు 12న విడుదల కానుండగా.. నితిన్ మాచర్ల నియోజకవర్గం కూడా అదే రోజు విడుదల చేయనున్నారు. దీంతో అఖిల్ ఈ ట్రైయాంగిల్ పోటీని ఎలా తట్టుకుంటాడా అన్నది ఆసక్తిగా మారింది.

×