SSMB28: మహేష్ తో త్రిష.. కానీ కండిషన్స్ అప్లై!

మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమాల గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. అతడు, ఖలేజా సినిమాలు ఇప్పటికీ టీవీల్లో భారీ టీఆర్పీలను సొంతం చేసుకుంటున్నాయి. అలాంటిది ఇప్పుడు ఈ కాంబినేషన్ లో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

SSMB28: మహేష్ తో త్రిష.. కానీ కండిషన్స్ అప్లై!

Ssmb28

SSMB28: మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమాల గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. అతడు, ఖలేజా సినిమాలు ఇప్పటికీ టీవీల్లో భారీ టీఆర్పీలను సొంతం చేసుకుంటున్నాయి. అలాంటిది ఇప్పుడు ఈ కాంబినేషన్ లో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం సర్కారు వారి పాట బిజీలో ఉన్న మహేష్ అక్కడ నుండి బయటపడగానే త్రివిక్రమ్ సినిమా మొదలు కానుంది. ఈలోగా త్రివిక్రమ్ ప్రీప్రొడక్షన్ పనుల్లో ఉన్నారు.

ఈ క్రేజీ కాంబినేషన్ కోసం హీరోయిన్స్ వేట జరుగుతుంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉండగా ముందుగా ఒకరు జాన్వీ కపూర్ అనే పేరు వినిపించింది. ఆ తర్వాత నివేద థామస్.. పూజా హెగ్డే పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే, ఇందులో మరో కథానాయకిగా త్రిష పరిశీలనలో ఉన్నట్లుగా వినిపిస్తుంది. త్రిష ప్రస్తుతం తమిళంలో యంగ్ హీరోలతో జత కడుతూనే సోలో సినిమాలను లైన్లో పెడుతుంది.

ఈక్రమంలో టాలీవుడ్ నుండి పలు ఆఫర్లను తిరస్కరించినట్లు చాలాకాలంగా వినిపిస్తూనే ఉంది. ఇందులో చిరంజీవి-కొరటాల శివ ఆచార్య సినిమాతో పాటు.. బాలకృష్ణ-గోపీచంద్ మలినేని సినిమాలు కూడా ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు మహేష్-త్రివిక్రమ్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తుందా అన్నది సస్పెన్స్ గా మారింది. నిజానికి త్రిష టాలీవుడ్ రీఎంట్రీకి ఇది మంచి అవకాశమే.. మరి త్రిష ఆలోచన.. కాలం ఎలా ఉందో చూడాల్సి ఉంది.