Bheemla Nayak: పవన్‌కు బాకీపడ్డా లెక్కను సరిచేసిన త్రివిక్రమ్

అన్నీ లెక్కలు కుదిర్చి.. అభిమానులకు సూపర్ కిక్కిచ్చారు త్రివిక్రమ్. అజ్ఞాతవాసితో ఫ్లాప్ కొట్టి పవన్ కు బాకీపడ్డ మాటల మాంత్రికుడు ఇప్పుడా లెక్కను సరిచేశారు. రికార్డు కలెక్షన్స్ తో..

Bheemla Nayak: పవన్‌కు బాకీపడ్డా లెక్కను సరిచేసిన త్రివిక్రమ్

Bheemla Nayak

Bheemla Nayak: అన్నీ లెక్కలు కుదిర్చి.. అభిమానులకు సూపర్ కిక్కిచ్చారు త్రివిక్రమ్. అజ్ఞాతవాసితో ఫ్లాప్ కొట్టి పవన్ కు బాకీపడ్డ మాటల మాంత్రికుడు ఇప్పుడా లెక్కను సరిచేశారు. రికార్డు కలెక్షన్స్ తో గ్రాండ్ ఓపెనింగ్ తెచ్చుకుని.. భీమ్లా బ్లాక్ బస్టర్ గా దూసుకుపోతుందంటే పవర్ స్టార్ వెనకుండి నడిపించిన త్రివికమ్ లీడ్ రీజన్.

Bheemla Nayak: యాక్షన్, ఇంటెన్స్ ఎమోషన్స్.. బొమ్మ చూపించేశాడు బాబోయ్!

మాటల మాంత్రికుడు బాకీ తీర్చేసుకున్నారు. సూపర్ హిట్ లిస్ట్ లో పవన్ సినిమాను చేర్చేసి సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. లాస్ట్ టైమ్ అజ్ఞాతవాసిగా పవర్ స్టార్ ను చూపించి ఫ్యాన్స్ ను డిస్సప్పాయింట్ చేసిన త్రివిక్రమ్.. ఇప్పుడు భీమ్లానాయక్ ను తీసుకొచ్చి లెక్క సరిచేశారు. పవన్ కల్యాణ్ నే కాదు.. ఆయన ఫ్యాన్స్ ను సంతృప్తి పరిచి ఇది కదా కావాల్సింది అనిపించారు. జల్సా, అత్తారింటికి దారేది తర్వాత అంతకుమించిన రేంజ్ చూపించారు.

Bheemla Nayak: కథ మీద ప్రేమను చంపుకున్నప్పుడే మనం అనుకున్నది వస్తుంది – త్రివిక్రమ్

నిజానికి భీమ్లానాయక్ ప్రీరిలీజ్ ఫంక్షన్ అన్నప్పుడు త్రివిక్రమ్ స్పీచ్ ను అందరూ ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ అజ్ఞాతవాసి ఎఫెక్టో ఇంకేదైనా కారణమో కానీ పవన్ ఈవెంట్ లో సైలెంటయిపోయారు. ఇప్పుడు భీమ్లా సక్సెస్ సాధించాక మానౌన్ని విడి సంతోషంగా మాట్లాడుతున్నారు. కేవలం రిలీజ్ రోజే వరల్డ్ వైడ్ 56 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన భీమ్లానాయక్ ను చూపించి కాలర్ ఎగిరేస్తున్నారు.

Bheemla Nayak : తెలుగు సినిమాని ఇక ఏ ఫోర్స్ ఆపలేదు.. ‘భీమ్లా నాయక్’పై దేవాకట్టా వ్యాఖ్యలు..

భీమ్లానాయక్ డైరెక్టర్ సాగర్ చంద్ర. కానీ ఆయన్ని నడిపించింది త్రివిక్రమ్. భీమ్లాకు కథతో పాటూ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ను ఆయన అందించారు. అయితే త్రివిక్రమ్ ఆలోచలనకు తగినట్టు విజువలైజ్ చేసి సూపర్ అనిపించుకున్నారు సాగర్ చంద్ర. ఎందుకంటే పవన్ తీన్ మార్ సినిమాకు కూడా స్క్రీన్ ప్లేతో పాటూ మాటలందించారు త్రివిక్రమ్. కానీ సరిగ్గా డీల్ చేయలేక తడబాటు చూపించాడు డైరెక్టర్ జయంత్.సి.పరాన్జీ. భీమ్లా విషయంలో అలా జరగకుండా సాగర్ చంద్ర మంచి మార్కులే కొట్టేశాడు.