Trivikram : భీమవరం వెళ్లి క్రికెట్ ఆడుకుంటుంటే నాకు ఫోన్ చేసి దర్శకుడిని చేశారు.. నీ ఇష్టం వచ్చినట్టు చావు అని నన్ను వదిలేశారు..

త్రివిక్రమ్ మాట్లాడుతూ.. ''రవికిశోర్ కి నేనెన్ని సార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. నేను చెప్పిన ప్రతి కథ విన్నారు. నువ్వే కావాలి సినిమా కథని మద్రాస్ లో చెప్పినప్పుడు విన్నారు. నేను స్వయంవరం సినిమా రాసిన తర్వాత నాకు అవకాశాలు లేకపోతే ఇంటికెళ్లిపోయాను. అప్పట్లో ఫోన్లు లేవు భీమవరంలో క్రికెట్ ఆడుకుంటుంటే................

Trivikram : భీమవరం వెళ్లి క్రికెట్ ఆడుకుంటుంటే నాకు ఫోన్ చేసి దర్శకుడిని చేశారు.. నీ ఇష్టం వచ్చినట్టు చావు అని నన్ను వదిలేశారు..

Trivikram speech at Nuvve Nuvve 20 years celebrations

Trivikram :  తరుణ్, శ్రియ జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా నువ్వే నువ్వే. స్రవంతి రవికిశోర్ ఈ సినిమాని నిర్మించారు. నువ్వే నువ్వే సినిమా విడుదలై 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా AMB సినిమాస్‌లో స్పెషల్ షో వేసి, సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ అంతా హాజరయ్యారు. త్రివిక్రమ్ మొదటి సినిమా కావడంతో ఈ సెలబ్రేషన్స్ ని ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకలో త్రివిక్రమ్ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలని తెలియచేశారు. త్రివిక్రమ్ మాట్లాడుతూ.. ”రవికిశోర్ కి నేనెన్ని సార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. నేను చెప్పిన ప్రతి కథ విన్నారు. నువ్వే కావాలి సినిమా కథని మద్రాస్ లో చెప్పినప్పుడు విన్నారు. నేను స్వయంవరం సినిమా రాసిన తర్వాత నాకు అవకాశాలు లేకపోతే ఇంటికెళ్లిపోయాను. అప్పట్లో ఫోన్లు లేవు భీమవరంలో క్రికెట్ ఆడుకుంటుంటే మా ఇంటి పక్కన ఉన్న STD బూత్ ఫోన్ నంబర్ కనుక్కొని మరీ నాకు ఫోన్ చేసి మళ్ళీ పరిశ్రమలో చోటిచ్చారు స్రవంతి రవికిశోర్ గారు. నువ్వు నాకు నచ్చావ్ కథని ఆయన అనుకున్న హీరోకి కాకుండా పెద్ద హీరోకి చెప్తా అంటే సరే అన్నారు. నేను రాసిన స్క్రిప్ట్స్ చదివి అర్ధరాత్రి కాల్ చేసి ఏడ్చేవారు. పంజాగుట్ట రూమ్ లో ఉన్నప్పుడు నా రూమ్ కిందకి బైక్ మీద వచ్చి హారన్ కొట్టేవాడు. అలాంటి ఆయనకి నేను ఎలా కృతజ్ఞతలు చెప్పాలి”

”నువ్వే కావాలి సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు రవికిశోర్ గారు, నేను ఖాళీగా ఉండి పక్కన నడుస్తుంటే ఆయనకీ నువ్వే నువ్వే కథ చెప్పాను. ఆ తర్వాత ఆయన చెక్ బుక్ తీసి ‘నువ్వే కావాలి’కి రైటర్‌గా ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారో అంత అమౌంట్ అడ్వాన్స్‌గా ఇచ్చారు. నేను దాంతో నా ఫస్ట్ బైక్ కొనుక్కున్నాను. నేనప్పటికి ఒక్క సినిమా కూడా చేయలేదు కానీ నేను చెప్పిన కథ విని రవికిశోర్ గారు ఎంతో నమ్మారు. నాలో ఉన్న రచయితని, దర్శకుడిని నాకంటే ఎక్కువ ఆయనే నమ్మారు. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాను.”

RGV : మా చిరంజీవిని అంటావా.. గరికపాటిపై ఆర్జీవీ తీవ్ర విమర్శలు..

”నువ్వే నువ్వే సినిమా కథని ఢిల్లీకి వెళ్లి శ్రియ‌తో పాటు వాళ్ళ అమ్మకు కూడా చెప్పడం నుంచి, శ్రీనగర్ కాలనీలో రవికిశోర్ గారి ఆఫీసులో అందరికీ స్క్రిప్ట్ రీడింగ్ ఇవ్వడం, ప్రకాశ్ రాజ్ గారి ఇంటికి వెళ్లడం, ఊటీలో షూటింగ్ చేయడం… ప్రతిదీ ఇప్పటికీ గుర్తు. నువ్వే నువ్వే షూటింగ్‌లో ఫైట్ మాస్టర్ లేకపోతే తరుణ్ చేత ఒక కిక్ కొట్టించే సీన్ నేనే చేశాను. అప్పుడు నాలో వయలెన్స్ ఉందని నాకు అర్థమైంది. అతడు సినిమా తీసిన తర్వాత వెంకటేష్ గారు నువ్వు చూస్తే సాఫ్ట్ గా ఉంటావు. సినిమా ఏంటి ఇంత వైలెంట్ గా తీశావు అన్నారు. ఆ వయలెన్స్ బహుశా ‘నువ్వే నువ్వే’ సినిమాలో ఆ కిక్ తోనే స్టార్ట్ అయిందనుకుంట.”

”గాలిపటం గగనానిదా? ఎగరేసే నేలదా? అని రాసిన శాస్త్రి గారి గురించి నేను ఏం చెప్పగలను. ఆయన మాటల్లోనే చెప్పాలంటే ‘ఆయన ఉఛ్వాసం కమలం. ఆయన నిశ్వాసం గానం. ఆయన జ్ఞాపకం మన అందరికీ ఎప్పటికీ అమరం’ అటువంటి సీతారామశాస్త్రి గారి దివ్య స్మృతికి ఆయన పాదాల దగ్గర ఈ సినిమాను రవికిశోర్ గారు, నేను, మా చిత్ర యూనిట్ నివాళిగా అర్పిస్తున్నాం” అని అన్నారు. ఆ తర్వాత దర్శకుడిగా తనను పరిచయం చేసిన ‘స్రవంతి’ రవికిశోర్ కు పాదాభివందనం చేశారు త్రివిక్రమ్. 20 ఏళ్ళ తర్వాత అందరూ కలవడంతో ఈవెంట్లో అందరూ అప్పటి జ్ఞాపకాలని గుర్తు చేసుకున్నారు.