Mahesh Babu: మహేష్ కోసం త్రివిక్రమ్ పాతదే వాడేస్తాడా? | Trivikram To Use Old Title For Mahesh Babu

Mahesh Babu: మహేష్ కోసం త్రివిక్రమ్ పాతదే వాడేస్తాడా?

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డుల వేటను కొనసాగిస్తోంది. ఈ సినిమా ఇప్పటికే....

Mahesh Babu: మహేష్ కోసం త్రివిక్రమ్ పాతదే వాడేస్తాడా?

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డుల వేటను కొనసాగిస్తోంది. ఈ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల గ్రాస్ వసూళ్ల మార్క్‌కు చేరువలో ఉండటంతో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కించిన తీరు వారిని అమితంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో మరోసారి తనలోని మాస్‌ను బయటపెట్టాడు మహేష్. ఇక ఈ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న మహేష్, తన నెక్ట్స్ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.

Mahesh Babu: మహేష్ సినిమాలో మరో స్టార్ హీరో.. ఎవరంటే?

ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన అతడు, ఖలేజాలు ఇప్పటికీ టీవీల్లో ప్రేక్షకులను అలరిస్తున్నాయంటే, వీరి కాంబోలో రాబోయే సినిమా కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో వెయిట్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కోసం త్రివిక్రమ్ ఆల్రెడీ ఓ టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. కథకు అనుగుణంగా ఉండేలా ‘అర్జునుడు’ అనే టైటిల్‌ను ఈ సినిమాకు ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Mahesh Babu: మహేష్ ఫ్యాన్స్‌కు షాక్.. సినిమా ఇప్పట్లో లేనట్టే..?

అయితే ఈ టైటిల్ చాలా పాతదే అయినా, ఈ సినిమాకు పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుందని త్రివిక్రమ్ భావిస్తున్నాడట. అంతేగాక ఈ సినిమా టైటిల్ విషయంలో మహేష్ కూడా ఓకే చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి నిజంగానే ఈ సినిమాకు ‘అర్జునుడు’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసిందా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాను త్వరలోనే పట్టాలెక్కించేందుకు మహేష్ అండ్ త్రివిక్రమ్ రెడీ అవుతున్నారు. ఈ సినిమాతో ఈ కాంబినేషన్ హ్యాట్రిక్ సక్సెస్ కొడతారని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటించబోతుంది.

×