Sushant Singh Rajput : సుశాంత్ సింగ్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ..

సుశాంత్ సింగ్ రాజపుత్ (Sushant Singh Rajput) సూసైడ్ గురించి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Sushant Singh Rajput : సుశాంత్ సింగ్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ..

Union Minister Smriti Irani comments on Sushant Singh Rajput death

Sushant Singh Rajput : బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజపుత్ (Sushant Singh Rajput) సూసైడ్ చేసుకొని ఏళ్ళు గడుస్తున్నా.. అతని ఇంకా మర్చిపోలేక పోతున్నారు చాలా మంది. కాగా ఇటీవల సుశాంత్ సింగ్ ది సూసైడ్ కాదు, బాడీ పై గాయాలు ఉన్నాయి అంటూ అతనికి పోస్టుమార్టం నిర్వహించిన డాక్టర్ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ తీవ్ర దుమారాన్ని లేపాయి. అయినాసరే సుశాంత్ మరణం ఇప్పటికి ఒక మిస్టరీ లానే ఉంది. ఇది ఇలా ఉంటే, తాజాగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani), సుశాంత్ సింగ్ పై ఆగ్రహం వ్యక్తం వ్యక్తం చేశారు.

Sushant Singh Rajput : సుశాంత్ చనిపోయే ముందు నాకు మెసేజ్ చేశాడు.. కానీ నేను అతనిని అవమానించా.. అనురాగ్ కశ్యప్!

మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన స్మృతి ఇరానీ.. ఆ తరువాత టీవీ సీరియల్స్ తో, పలు సినిమాల్లో కూడా నటించారు. సీరియల్స్ నటిస్తున్న సమయంలో సుశాంత్ సింగ్ తో కలిసి పని చేయడంతో, తనతో మంచి సంబంధం ఉంది. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా, సుశాంత్ మరణం గురించి మాట్లాడుతూ.. “సుశాంత్ సింగ్ మరణించినప్పుడు నేను ముఖ్యమైన వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్నాను. కచ్చితంగా ఆ కాన్ఫరెన్స్ కొనసాగించాలి. కానీ సుశాంత్ మరణ వార్త తట్టుకోలేక పోయాను. ఆ కాన్ఫరెన్స్ ఆపేసి వెంటనే తన స్నేహితుడు అమిత్ సాద్‌కి కాల్ చేసి మాట్లాడాను.

సుశాంత్ అలా చేసుకున్నందుకు నాకు చాలా కోపం వచ్చింది. తను నాకు కాల్ చేయాల్సింది. ఒకవేళ తను నాకు కాల్ చేసి ఉంటే.. మిమ్మల్ని మీరు బలవంతంగా చంపుకోవడం ఆపండి అని చెప్పాలి అనుకున్నాను” అంటూ భావోద్వాగానికి గురయ్యారు. కాగా ఇటీవల బాలీవుడ్ ప్రముఖ ఫిలిం మేకర్ అనురాగ్ కశ్యప్ కూడా ఒక ఇంటర్వ్యూలో సుశాంత్ గురించి మాట్లాడుతూ.. సుశాంత్ సింగ్ చనిపోయే మూడు వారాలు ముందు నాకు మెసేజ్ చేశాడు. కానీ తనని ఇగ్నోర్ చేశాను. ఆ పని చేసినందుకు దాదాపు ఏడాదిన్నర పాటు గిల్ట్ తో బాధ పడ్డాను అంటూ తెలియజేశాడు.