Upendra : ఆ సినిమా అర్ధం చేసుకుంటే మీరు సూపర్ స్టార్ అయ్యిపోతారు.. ఉపేంద్ర!

కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర నటించిన తాజా చిత్రం 'కబ్జ'. శ్రియా హీరోయిన్ గా నటిస్తున్న ఈ పాన్ ఇండియా వైడ్ మూవీ నేడు (మార్చి 17) ఆడియన్స్ ముందుకు వచ్చింది. కాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఉపేంద్ర టాలీవుడ్ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యాడు.

Upendra : ఆ సినిమా అర్ధం చేసుకుంటే మీరు సూపర్ స్టార్ అయ్యిపోతారు.. ఉపేంద్ర!

Upendra gave update on his upcoming movie UI

Upendra : కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర నటించిన తాజా చిత్రం ‘కబ్జ’. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ మూవీ 1945లో బ్రిటిష్ రూలింగ్ ఇండియా నేపథ్యంతో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరోలు కూడా కిచ్చా సుదీప్, శివరాజ్ కుమార్ కూడా కనిపించనున్నారు. సుదీప్ పూర్తి స్థాయి పాత్రలో కనిపిస్తుండగా, శివరాజ్ కుమార్ ఒక ముఖ్య పాత్రలో ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. శ్రియా హీరోయిన్ గా నటిస్తున్న ఈ పాన్ ఇండియా వైడ్ మూవీ నేడు (మార్చి 17) ఆడియన్స్ ముందుకు వచ్చింది.

Kabzaa : బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన ఉపేంద్ర.. కబ్జ మూవీలో మరో స్టార్ హీరో!

కాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఉపేంద్ర టాలీవుడ్ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యాడు. ఉపేంద్రకి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. గతంలో అతను నటించిన పలు సినిమాలకు ఇక్కడ చాలా మంది అభిమానులు ఏర్పడ్డారు. దీంతో ఈ ప్రెస్ మీట్ లో ఉపేంద్ర గతంలో దర్శకత్వం వహించిన ‘ఉపేంద్ర’ సినిమాలోని డైలాగ్స్ చెప్పమని ఆడియన్స్ అడగగా.. ఉపేంద్ర డైలాగ్స్ చెప్పి ఆడియన్స్ ని ఉత్సాహపరిచాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉపేంద్ర డైరెక్ట్ చేస్తున్న UI మూవీ గురించి చెప్పాలి అంటూ ఆడియన్స్ ప్రశ్నించారు.

ఉపేంద్ర బదులిస్తూ.. ”UI మూవీ కొత్తగా ఉంటుంది. మేకింగ్ అండ్ స్క్రీన్ ప్లే నా స్టైల్ లో ఉంటుంది. రెగ్యులర్ కమర్షియల్ మూవీగా అయితే ఉండదు. అది అర్ధం చేసుకోడానికి కొంచెం ఆలోచించాలి. కానీ అది చేసుకుంటే మాత్రం మీరు సూపర్ స్టార్ అయ్యిపోతారు” అంటూ వెల్లడించాడు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌లు, స్టిల్స్ మూవీ పై భారీ హైప్ ని క్రియేట్ చేస్తున్నాయి. మరి నేడు రిలీజ్ అయిన పాన్ ఇండియా మూవీ కబ్జ ఎటువంటి రిజల్ట్ ని చూస్తుందో చూడాలి.