Varaharoopam : ఓటీటీలో ఫ్యాన్స్‌ని నిరాశ పరిచిన కాంతార..

తాజాగా గురువారం నుంచి కాంతార సినిమా అమెజాన్ ఓటీటీలో రిలీజ్ అయింది. అయితే ఓటీటీలో కాంతార సినిమా చూసిన వాళ్ళు నిరాశ చెందుతున్నారు. అందుకు కారణం..........

Varaharoopam : ఓటీటీలో ఫ్యాన్స్‌ని నిరాశ పరిచిన కాంతార..

Varaharoopam song music removed from kantara movie in OTT

Varaharoopam :  రిషబ్ శెట్టి హీరోగా, అతని దర్శకత్వంలో తెరకెక్కిన కాంతార సినిమా కన్నడలో చిన్న సినిమాగా రిలీజయి ఆ తర్వాత దేశమంతటా రిలీజయి భారీ విజయం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా కాంతార సినిమా దాదాపు 400 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ సినిమాకి క్లైమాక్స్ చాలా ప్లస్ అయింది. సినిమా క్లైమాక్స్ వల్లే ఇంత పెద్ద హిట్ అయిందని చూసిన ప్రేక్షకులంతా అన్నారు. అలాగే క్లైమాక్స్ లో వచ్చే వరాహరూపం సాంగ్, మ్యూజిక్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ పాట, మ్యూజిక్ చాలా ఫేమస్ అయింది. ప్రేక్షకులకి ఈ పాట బాగా నచ్చడంతో లూప్ లో వింటున్నారు, ఈ మ్యూజిక్ ని రింగ్ టోన్స్ గా పెట్టుకుంటున్నారు.

తాజాగా గురువారం నుంచి కాంతార సినిమా అమెజాన్ ఓటీటీలో రిలీజ్ అయింది. అయితే ఓటీటీలో కాంతార సినిమా చూసిన వాళ్ళు నిరాశ చెందుతున్నారు. అందుకు కారణం వరాహరూపం మ్యూజిక్ లేకపోవడమే. ఇటీవల వరాహరూపం సాంగ్ కి వాడిన మ్యూజిక్ మాదే అంటూ ఓ ప్రైవేట్ మ్యూజిక్ బ్యాండ్ కోర్టులో కేసు వేయడంతో సినిమాలో ఆ పాటని లేదా ఆ మ్యూజిక్ ని తీసేయాలంటూ కోర్టు కాంతార సినిమాకి షాకిచ్చింది.

Richa Chadha : స్టార్ సెలబ్రిటీలు సైతం రిచా చద్దాపై ఫైర్.. ట్వీట్ డిలీట్ చేసి సారీ చెప్పిన భామ..

దీంతో ఓటీటీలో రిలీజ్ చేసేటప్పుడు సినిమాలో ఆ పాటకి మ్యూజిక్ మార్చి రిలీజ్ చేశారు. దీంతో ప్రేక్షకులు నిరాశ చెందుతున్నారు. పాత మ్యూజిక్ బాగుంది, ఇది బాగోలేదు. పాత వరాహ రూపం పాట కావాలని సోషల్ మీడియాలో #Varaharoopam హ్యాష్‌ట్యాగ్‌ని కామెంట్స్, ట్వీట్స్‌ చేస్తున్నారు. మరి దీనిపై చిత్ర యూనిట్ స్పందిస్తుందేమో చూడాలి.