వరుణ్ తేజ్ ‘పంచ్’‌కు ముహూర్తం ఫిక్స్..

మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించబోయే కొత్త సినిమా అక్టోబర్ 10న పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది.. కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు..

  • Published By: sekhar ,Published On : October 10, 2019 / 06:29 AM IST
వరుణ్ తేజ్ ‘పంచ్’‌కు ముహూర్తం ఫిక్స్..

మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించబోయే కొత్త సినిమా అక్టోబర్ 10న పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది.. కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు..

F2, గద్దల కొండ గణేష్ వంటి డిఫరెంట్ సినిమాలతో బాక్సాఫీస్ హిట్స్ అందుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరో క్రేజీ ప్రాజెక్ట్‌కి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ‘కంచె’, ‘అంతరిక్షం’ వంటి ప్రయోగాత్మకమైన సినిమాలలో, డిఫరెంట్ పాత్రలను ఎంచుకుని అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరవుతున్న వరుణ్.. ఈ సారి కిక్ బాక్సర్‌గా కనిపించనున్నాడు. నేడు (అక్టోబర్ 10)న వరుణ్ తేజ్ 10వ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరగనున్నాయి.

ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. అల్లు అరవింద్ సమర్పణలో అల్లు వెంకటేష్ (అల్లు బాబీ) ఈ సినిమా ద్వారా నిర్మాతగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. రినస్సాన్స్ పిక్చర్స్ – బ్లూ వాటర్ క్రియేటివ్ బ్యానర్‌లో రూపొందించనున్నారు. కిరణ్ కొర్రపాటి  దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

తొలిప్రేమతో వరుణ్‌కి మంచి ఆల్బమ్ ఇచ్చిన థమన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించబోతున్నాడు. రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్‌లో స్టార్ట్ కానుంది. అల్లు వెంకటేష్‌తో పాటు సిద్ధు నిర్మాతగా ఉన్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.