Venkatesh: వెంకీకి ఆ పాత్రలో మరో ‘హిట్’ ఇస్తానంటోన్న డైరెక్టర్..?

టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ఇటీవల ఎఫ్3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ కావడంతో వెంకీ కెరీర్‌లో మరో హిట్ నమోదయ్యింది. ఇక ఈ సినిమా తరువాత వెంకటేష్ తన నెక్ట్స్ మూవీని ఎవరితో చేస్తాడా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, ప్రస్తుతం ఓ బాలీవుడ్ సినిమాలో కేమియో పాత్రలో నటిస్తున్నాడు వెంకీ.

Venkatesh: వెంకీకి ఆ పాత్రలో మరో ‘హిట్’ ఇస్తానంటోన్న డైరెక్టర్..?

Venkatesh To Do HIT 4 With Sailesh Kolanu

Venkatesh: టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ఇటీవల ఎఫ్3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ కావడంతో వెంకీ కెరీర్‌లో మరో హిట్ నమోదయ్యింది. ఇక ఈ సినిమా తరువాత వెంకటేష్ తన నెక్ట్స్ మూవీని ఎవరితో చేస్తాడా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, ప్రస్తుతం ఓ బాలీవుడ్ సినిమాలో కేమియో పాత్రలో నటిస్తున్నాడు వెంకీ.

Venkatesh: హిట్ డైరెక్టర్‌తో వెంకీ మూవీ.. నిజమేనా?

ఇక ఆ తరువాత తెలుగులో పలు కథలు వింటున్న వెంకటేష్ ఏదో ఒక ప్రాజెక్టును ఓకే చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ‘హిట్’ చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను ఇటీవల వెంకీకి ఓ స్టోరీ వినిపించాడని.. అది నచ్చిన వెంకీ, ఆయనతో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడని చిత్ర వర్గాల్లో టాక్ వినిపించింది. అయితే వెంకీ విన్నది మరేదో కథ కాదట.. శైలేష్ కొలను తన హిట్ వర్స్‌లోని 4వ సీక్వెల్ కథను వెంకీతో చేయాలని ప్లాన్ చేశాడట. పోలీస్ ఆఫీసర్ పాత్రలో వెంకీ అదరగొడతాడని శైలేష్ భావిస్తున్నాడు.

Victory Venkatesh: త్వరలో ఘర్షణ సీక్వెల్ రాబోతుంది.. కన్ఫర్మ్ చేసిన గౌతమ్ మీనన్!

అందుకే హిట్-3 సినిమా చివర్లో వెంకీ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ఎంట్రీ ఇస్తాడని.. ఆ తరువాత హిట్-4లో వెంకీ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌తో రెచ్చిపోతాడని తెలుస్తోంది. అయితే ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందనే విషయంపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. కాగా గతంలో ఘర్షణ సినిమాలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా వెంకీ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయిన సంగతి తెలిసిందే. మరి ఈ హీరో ఇప్పుడు మళ్లీ పోలీస్ గెటప్‌లో కనిపిస్తాడా లేడా అనేది చూడాలి.