Vijay: విజయ్ సినిమాలో మరో తమిళ హీరో.. ఎవరంటే?

తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘వారిసు’ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకుని, సంక్రాంతి బరిలో రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమా తరువాత విజయ్ తన నెక్ట్స్ ప్రాజెక్టును కూడా లైన్‌లో పెట్టేందుకు రెడీ అవుతున్నాడు. సెన్సేషనల్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్‌తో కలిసి మరోసారి చేతులు కలుపుతున్నాడు ఈ స్టార్ హీరో.

Vijay: విజయ్ సినిమాలో మరో తమిళ హీరో.. ఎవరంటే?

Vijay 67th Movie To Have Vishal In A Key Role

Vijay: తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘వారిసు’ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకుని, సంక్రాంతి బరిలో రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై తమిళనాటే కాకుండా తెలుగులోనూ మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా తరువాత విజయ్ తన నెక్ట్స్ ప్రాజెక్టును కూడా లైన్‌లో పెట్టేందుకు రెడీ అవుతున్నాడు.

Ajith-Vijay : 9 ఏళ్ళ తర్వాత సంక్రాంతికి ఢీ కొట్టుకోబోతున్న అజిత్, విజయ్.. తమిళ్ లో ఫ్యాన్స్ మధ్య భారీ గొడవలు తప్పవు..

తమిళ యంగ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్‌తో కలిసి మరోసారి చేతులు కలుపుతున్నాడు ఈ స్టార్ హీరో. థళపతి 67 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కబోతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా కోలీవుడ్‌లో ఓ వార్త జోరుగా వినిపిస్తోంది. ఈ సినిమాలో విజయ్ పాత్ర అల్టిమేట్‌గా ఉండబోతుందని.. అయితే ఈ సినిమాలో ఆయనతో పాటు మరో స్టార్ హీరో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. తమిళ హీరో విశాల్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించబోతున్నాడట. ఇప్పుడు ఈ వార్త కోలీవుడ్ వర్గాల్లో తెగ చక్కర్లు కొడుతోంది.

NTR 30-Thalapathy Vijay : అనిరుధ్ ఫిక్స్.. హెయిర్ స్టైలిష్‌తో విజయ్..

దీంతో విజయ్ లాంటి స్టార్ హీరో సినిమాలో విశాల్ లాంటి యాక్షన్ హీరో నటిస్తున్నాడంటే, ఆయన ఎలాంటి పాత్రలో కనిపిస్తాడా అనే ఆసక్తి తమిళ ఆడియెన్స్‌లో నెలకొంది. ఇక ఈ సినిమాను త్వరలోనే పట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుండగా, ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అటు, విశాల్ ప్రస్తుతం లాఠీ, మార్క్ ఆంటోని అనే సినిమాలను రెడీ చేస్తున్నాడు. మరి విజయ్ సినిమాలో విశాల్ నిజంగానే నటిస్తున్నాడా.. లేక ఇది కూడా కేవలం రూమర్‌గా మిగిలిపోతుందా అనేది తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.