Vijay-Rashmika : విజయ్ దేవరకొండ, రష్మిక ప్రేమించుకొని విడిపోయారా? మరి ఇప్పుడేంటి..?

విజయ్ రష్మిక డియర్ కామ్రేడ్ తర్వాత బాగా క్లోజ్ అయి ప్రేమించుకున్నారని, అయితే కొన్ని రోజుల తర్వాత వారిద్దరి మధ్య గొడవలు అయ్యాయని, విడిపోయారని తెలుస్తుంది. విడిపోతే మరి ఇప్పుడు..............

Vijay-Rashmika : విజయ్ దేవరకొండ, రష్మిక ప్రేమించుకొని విడిపోయారా? మరి ఇప్పుడేంటి..?

Vijay Devarakonda :  రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక రిలేషన్ లో ఉన్నారు అని అంతా అనుకుంటున్నారు. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలతో కూడా ఇది అంతా నిజం అనుకుంటున్నారు. ఇటీవల అనన్య పాండే విజయ్ రష్మికతో రిలేషన్ లో ఉన్నాడేమో అని హింట్ ఇచ్చింది. ఇక విజయ్ కూడా రష్మిక గురించి గొప్పగా చెప్పాడు కాఫీ విత్ కరణ్ షోలో. మరో షోలో రష్మిక నా డార్లింగ్ అని, విజయ్ రష్మిక గురించి మాట్లాడినప్పుడల్లా అంతా ఆసక్తిగా వింటారని అన్నారు. ఇక అప్పుడప్పుడు ముంబైలో కలిసి కనిపిస్తుంటారు ఈ జంట.

అయితే తాజాగా వీరిద్దరి గురించి ఓ ఆసక్తికర విషయం బయటకి వచ్చింది. రష్మిక గతంలోనే కన్నడ హీరో రక్షిత్ శెట్టితో నిశితార్థం చేసుకొని విడిపోయింది. ఆ తర్వాత కెరీర్ మీద ఫోకస్ పెట్టిన రష్మిక ఇప్పుడు సౌత్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతూ బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తుంది. విజయ్ దేవరకొండతో కలిసి గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలు చేసింది రష్మిక. ఈ సమయంలో వీరిద్దరూ బాగా క్లోజ్ అయ్యారు. అప్పట్లో చాలా సార్లు ఈ జంట బయట తిరుగుతూ మీడియాకి చిక్కారు.

Vijayashanthi : ఆమిర్ ఖాన్‌ ‘లాల్ సింగ్ చడ్డా’పై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు

ఇటీవల వారి సన్నిహితుల నుంచి వచ్చిన ఓ సమాచారం ఆశ్చర్యపరుస్తుంది. విజయ్ రష్మిక డియర్ కామ్రేడ్ తర్వాత బాగా క్లోజ్ అయి ప్రేమించుకున్నారని, అయితే కొన్ని రోజుల తర్వాత వారిద్దరి మధ్య గొడవలు అయ్యాయని, విడిపోయారని తెలుస్తుంది. విడిపోతే మరి ఇప్పుడు బాగా క్లోజ్ గానే ఉన్నారు కదా అని సందేహం వెల్లడిస్తే ప్రేమలో విడిపోయినా బెస్ట్ ఫ్రెండ్స్ గా కలిసి ఉండి, ఒకరి కెరీర్ కి ఒకరు సపోర్ట్ చేసుకోవాలి అని ఫిక్స్ అయ్యారట. మరి వీరు నిజంగానే ప్రేమించుకుంటున్నారా? కేవలం స్నేహితులేనా? లేదా ప్రేమించి విడిపోయారా? అని జనాలు తెగ ఆలోచిస్తున్నారట.