Vikram: ఓటీటీలోకి వచ్చేస్తున్న విక్రమ్.. రిలీజ్ డేట్ ఫిక్స్!
తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ బాక్సాఫీస్ సెన్సేషన్ మూవీ విక్రమ్ ఇటీవల రిలీజ్ అయ్యి ఎలాంటి సక్సెస్‌ను అందుకుందో మనం చూశాం. ఈ చిత్రాన్ని దర్శకుడు....
Vikram: తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ బాక్సాఫీస్ సెన్సేషన్ మూవీ విక్రమ్ ఇటీవల రిలీజ్ అయ్యి ఎలాంటి సక్సెస్‌ను అందుకుందో మనం చూశాం. ఈ చిత్రాన్ని దర్శకుడు లోకేష్ కనగరాజ్ తనదైన మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందించగా, ఫహాద్ ఫాజిల్, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమాలోని హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను సరికొత్తగా థ్రిల్ చేయడంలో సక్సెస్ అయ్యాయి.
Vikram: చెన్నైలో విక్రమ్ నయా రికార్డ్!
ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ అంచనాల మధ్య జూన్ 3న రిలీజ్ చేయగా, తొలిరోజే ఈ సినిమాకు అదిరిపోయే టాక్ దక్కింది. ఇక ఈ చిత్రానికి పోటీగా మరే ఇతర భారీ సినిమా లేకపోవడంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకే ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చారు. దీంతో ఈ సినిమా తమిళనాట హయ్యెస్ట్ గ్రాసర్ మూవీగా నిలిచింది. ఇటు తెలుగులోనూ ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో సూపర్ హిట్ చిత్రంగా భారీ విజయాన్ని అందుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్కు రెడీ అయ్యింది.
Vikram: విక్రమ్ కోసం ఖైదీ వెంటపడుతున్న జనం!
ఈ సినిమాతో తిరిగి తన స్టార్ డమ్‌ను ప్రూవ్ చేసుకున్న కమల్ హాసన్, ఇంకా ఈ సినిమాను చూడని వారి కోసం ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ సినిమాను జూలై 8న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సినిమాలో యాక్షన్‌తో పాటు ఎమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కమల్ హాసన్, ఫహాద్ ఫాజిల్, విజయ్ సేతుపతి.. ఈ మూడు పాత్రలను ఏ క్యారెక్టర్ ఎక్కడా తగ్గకుండా పోటాపోటీగా రూపొందించిన విధానం ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేసింది. ఇక థియేటర్లో విక్రమ్ సినిమాను చూసి ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు కూడా తిరిగి ఓటీటీలో ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని వేచి చూస్తున్నారు.
நாயகன் மீண்டும் வரார்.. ?? #Vikram Streaming from July 8 on #DisneyplusHotstar #VikramOnDisneyplusHotstar @ikamalhaasan @Dir_Lokesh @anirudhofficial @VijaySethuOffl #FahadhFaasil @Suriya_offl @Udhaystalin #Mahendran @RKFI @turmericmediaTM @SonyMusicSouth @RedGiantMovies_ pic.twitter.com/QUey20zavP
— Disney+ Hotstar Tamil (@disneyplusHSTam) June 29, 2022