Vishnu Vishal : కష్టకాలంలో జ్వాల నాకు ధైర్యాన్ని ఇచ్చింది.. విష్ణు విశాల్!

తమిళ నటుడు విష్ణు విశాల్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘మట్టి కుస్తి’. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం ఈ నెల 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మూవీ టీమ్ పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూలో హీరో విశాల్, బ్యాట్‌మెంటన్ ప్లేయర్ 'జ్వాల గుత్తా' గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Vishnu Vishal : కష్టకాలంలో జ్వాల నాకు ధైర్యాన్ని ఇచ్చింది.. విష్ణు విశాల్!

Vishnu Vishal comments on jwala gutta

Vishnu Vishal : తమిళ నటుడు విష్ణు విశాల్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘మట్టి కుస్తి’. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం ఈ నెల 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్పోర్ట్స్ కి ఫ్యామిలీ కామెడీ డ్రామాని జత చేయడంతో ప్రేక్షకులు థియేటర్ లో మూవీని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మూవీ టీమ్ పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూలో హీరో విశాల్, బ్యాట్‌మెంటన్ ప్లేయర్ ‘జ్వాల గుత్తా’ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

matti kusthi pre release event : మట్టి కుస్తీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ..

జ్వాల గుత్తా, విష్ణు విశాల్ గత ఏడాది ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. విష్ణు ఆమె గురించి మాట్లాడుతూ.. “నేను కష్ట సమయంలో ఉన్నపుడు జ్వాల నా జీవితంలోకి వచ్చింది. నాకు ధైర్యాన్ని చెప్పి, ఎంతో సపోర్ట్ చేసింది. ఆమె ఇచ్చిన సపోర్ట్ నాలో ఎంతో ఎనర్జీని నింపింది” అంటూ చెప్పుకొచ్చాడు. కాగా విష్ణు విశాల్ కి జ్వాలతో ఇది రెండో వివాహం, మొదటి భార్యకి 2018లో విడాకులు ఇచ్చాడు.

కాగా మట్టి కుస్తీ సినిమాను తన సొంత నిర్మాణ సంస్థ ‘విష్ణు విశాల్ స్టూడియోస్’ పతాకంపై నిర్మించాడు. ఈ సినిమాకు మరో నిర్మాతగా టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ వ్యవహరించాడు. ప్రొడ్యూసర్ గా రవితేజకి ఇదే మొదటి సినిమా. విష్ణు విశాల్ రెజ్లర్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటించింది. చెల్లా అయ్యావు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించాడు.