Vishwak Sen : మెగాస్టార్‌తో పోటీకి సై అంటున్న యువ హీరో

“అశోక వనంలో అర్జున కళ్యాణం” సినిమా ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడుతూ వస్తుంది. ప్రతి సారి ఏదో ఒక అడ్డంకి వచ్చి వాయిదా పడుతూ వస్తుంది. ఇప్పుడు కూడా ఏప్రిల్ 22న ఈ సినిమా.............

Vishwak Sen : మెగాస్టార్‌తో పోటీకి సై అంటున్న యువ హీరో

Acharya

Mega Star Chiranjeevi :  యువ హీరో విశ్వక్ సేన్ మాస్ కా దాస్ అని పేరు తెచ్చుకొని మాస్ ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు క్లాస్ ఆడియన్స్ ని కూడా తనవైపుకు తిప్పుకోవడానికి క్లాస్ సినిమాలు చేయడం మొదలు పెట్టాడు. విశ్వక్ గత సినిమా పాగల్ యావరేజ్ గా నిలిచింది. ప్రస్తుతం విశ్వక్ సేన్ “అశోక వనంలో అర్జున కళ్యాణం” సినిమాతో రాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులని మెప్పించాయి.

“అశోక వనంలో అర్జున కళ్యాణం” సినిమా ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడుతూ వస్తుంది. ప్రతి సారి ఏదో ఒక అడ్డంకి వచ్చి వాయిదా పడుతూ వస్తుంది. ఇప్పుడు కూడా ఏప్రిల్ 22న ఈ సినిమా రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ మళ్ళీ వాయిదా వేశారు. తాజాగా ఈ సినిమా కొత్త డేట్ ని ప్రకటించారు చిత్ర యూనిట్. ఈ చిత్ర యూనిట్ ప్రకటించిన కొత్త డేట్ చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.

Shivathmika : వైట్ షర్ట్, షార్ట్ నిక్కర్‌తో చెమటలు పట్టిస్తున్న శివాత్మిక..

విశ్వక్ సేన్ “అశోక వనంలో అర్జున కళ్యాణం” సినిమా ఏప్రిల్ 30న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు చిత్రబృందం. అయితే ఏప్రిల్ 29న మెగాస్టార్ చిరంజీవి, చరణ్ కలిసి నటించిన ‘ఆచార్య’ సినిమా విడుదల కాబోతుంది. మెగాస్టార్ సినిమా రిలీజ్ నెక్స్ట్ డేనే విశ్వక్ తన సినిమాని అనౌన్స్ చేయడంతో అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు మెగాస్టార్ కి పోటీగా ఎలా రిలీజ్ చేస్తాడు అని భావిస్తున్నారు, మరికొంతమంది ఐతే అసలు థియేటర్లు దొరుకుతాయా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి నిజంగానే ఆ రోజే సినిమా రిలీజ్ చేస్తారా లేక మళ్ళీ చివరి సమయంలో సినిమాని వాయిదా వేస్తారా చూడాలి. ఒకవేళ రిలీజ్ చేస్తే మాత్రం విశ్వక్ పెద్ద రిస్క్ చేస్తున్నట్టే. ఐతే విశ్వక్ మరీ అంత రిస్క్ చేయడని కనీసం వారం గ్యాప్ అయినా తీసుకుంటాడని అంటున్నారు సినీ వర్గాలు.