అమ్మాయి పేరుతో మెయిల్.. హీరోగా తీసేశారు.. స్క్రీన్‌ప్లే‌లో దేవుడు ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు.

‘ఈ న‌గ‌రానికి ఏమైంది’ సినిమాలో తనకు అవకాశం మిస్ అవడం.. తిరిగి రావడం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించిన విశ్వక్ సేన్..

  • Published By: sekhar ,Published On : March 15, 2020 / 10:23 AM IST
అమ్మాయి పేరుతో మెయిల్.. హీరోగా తీసేశారు..  స్క్రీన్‌ప్లే‌లో దేవుడు ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు.

‘ఈ న‌గ‌రానికి ఏమైంది’ సినిమాలో తనకు అవకాశం మిస్ అవడం.. తిరిగి రావడం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించిన విశ్వక్ సేన్..

సోషల్ మీడియా వల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతాయో.. ఒక్కోసారి మన తప్పు లేకుండానే బలైపోవాల్సి ఉంటుంది. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో, ఇటీవల ‘హిట్’ వంటి థ్రిల్లర్ మూవీతో మంచి హిట్ అందుకున్న విశ్వక్ సేన్ తన విషయంలో జరిగిన ఊహించిన సంఘటన వల్ల ఏకంగా సినిమా చాన్స్ మిస్ అయ్యాడట. ఈ ఘటన గురించి పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు విశ్వక్ సేన్.
‘‘ఈ న‌గ‌రానికి ఏమైంది’ సినిమా షూటింగ్ ప్రారంభమైన వారం త‌ర్వాత నా ప్లేస్‌లో ఇంకెవ‌రినో తీసుకున్నామ‌ని యూనిట్ స‌భ్యులు ఫోన్ చేశారు. ఎందుకని అడిగితే కార‌ణం చెప్ప‌లేదు. డైరెక్టర్ త‌రుణ్ భాస్క‌ర్‌కు ఫోన్ చేస్తే.. ‘ఎవ‌రో అమ్మాయికి అవ‌కాశం ఇస్తాన‌ని చెప్పి నువ్వు మోసం చేసిన‌ట్లు.. ఆ అమ్మాయి మెయిల్ పెట్టింద‌ని’ చెప్పాడు. ఆ మెయిల్‌ నాకు ఫార్వ‌ర్డ్ చేయ‌మ‌ని అడిగాను. 

ఆ మెయిల్‌లో ఉన్న మేటర్, రైటింగ్ చూశాక‌.. నాకు ప‌రిచ‌య‌మున్న వ్య‌క్తే ఆ మెయిల్ రాశాడ‌ని అర్థ‌మై.. అత‌న్ని క‌లిసి.. నిజం ఒప్పుకోమ‌ని రిక్వెస్ట్ చేసాను. అతను విన‌లేదు. సినిమా పోతుంది, క్యారెక్టర్ మీద మచ్చ పడుతుంది.. ఏం చేయాలో తెలియక బాధపడుతూ కూర్చున్నా.. ఇంతలో దేవుడు స్క్రీన్‌ప్లే‌లో ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. 

ఏ అమ్మాయి పేరు మీద అయితే మెయిల్ వ‌చ్చిందో.. ఆ అమ్మాయి త‌న పేరుని త‌ప్పుగా వాడుకున్నందుకు సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. దాంతో ఫేక్ మెయిల్ చేసిన వ్య‌క్తి నిజం ఒప్పుకోక త‌ప్ప‌లేదు. ఇలా కథ పలు మలుపులు తిరిగాక చివ‌ర‌కు ‘ఈ న‌గ‌రానికి ఏమైంది’ సినిమాలోకి తిరిగి తీసుకున్నార‌ు.. ఆ సినిమాలో నా క్యారెక్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది’’ అని చెప్పాడు విశ్వక్ సేన్..