Dhamki: మాస్ కా దాస్ ‘ధమ్కీ’ ఇచ్చేందుకు ఇంకా చాలా టైమ్ ఉందా..?
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తూ, డైరెక్ట్ చేస్తున్న తాజా చిత్రం ‘ధమ్కీ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. విశ్వక్ గతంలో డైరెక్ట్ చేసిన ‘ఫలక్‌నుమా దాస్’ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమాను ఆయన తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు మరోసారి తన డైరెక్షన్ ప్రతిభను చాటేందుకు రెడీ అయ్యాడు ఈ హీరో.

Dhamki: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తూ, డైరెక్ట్ చేస్తున్న తాజా చిత్రం ‘ధమ్కీ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. విశ్వక్ గతంలో డైరెక్ట్ చేసిన ‘ఫలక్‌నుమా దాస్’ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమాను ఆయన తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు మరోసారి తన డైరెక్షన్ ప్రతిభను చాటేందుకు రెడీ అయ్యాడు ఈ హీరో.
Dhamki: ‘ధమ్కీ’ ఫస్ట్ సింగిల్‌కు డేట్ ఫిక్స్ చేసిన దాస్
విశ్వక్ తెరకెక్కిస్తున్న ‘ధమ్కీ’ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమాను ఆయన తెరకెక్కిస్తున్న తీరు ప్రేక్షకులను ముఖ్యంగా యూత్‌ను బాగా అట్రాక్ట్ చేస్తుందని చిత్ర యూనిట్ అంటోంది. ఈ సినిమాలో విశ్వక్ సేన్ పర్ఫార్మెన్స్ పరంగా కూడా బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడట. కాగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేశాయి. అయితే ఈ సినిమాను ఫిబ్రవరి 17న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయబోతున్నట్లు గతంలో వెల్లడించింది చిత్ర యూనిట్.
Dhamki Release Date: విశ్వక్ సేన్ ‘ధమ్కీ’ ఇచ్చేందుకు డేట్ ఫిక్స్ చేశాడు!
కానీ ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ వాయిదా పడబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్ర షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతో రిలీజ్‌ను వాయిదా వేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట. కాగా, దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో అందాల భామ నివేథా పేతురాజ్ హీరోయిన్‌గా నటిస్తోండగా, లియోన్ జేమ్స్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. మరి విశ్వక్ సేన్ ‘ధమ్కీ’కి ఇంకా టైమ్ పడుతుందా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.