Balakrishna : ఊరంతా కలిసి చూసిన ‘అఖండ’

తాజాగా ప్రకాశం జిల్లా కూనమనేని వారి పాలెం అనే గ్రామంలో ఊరంతా కలిసి 'అఖండ' సినిమాని చూశారు. ఊర్లో తెర ఏర్పాటు చేసి 'అఖండ' సినిమాని ప్లే చేశారు. అఖండ సినిమాని చూడటానికి..........

Balakrishna : ఊరంతా కలిసి చూసిన ‘అఖండ’

Akhanda (1)

Akhanda :  బాలకృష్ణ , బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన ‘అఖండ’ సినిమా ఎంత భారీ విజయం సాధించిందో మన అందరికి తెలుసు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లోనూ ‘అఖండ’ భారీ విజయం సాధించి కలెక్షన్స్ రాబట్టింది. చాలా రోజుల తర్వాత ఒక సినిమా 50 రోజుల వేడుక జరుపుకోవడం ‘అఖండ’తోనే సాధ్యమైంది. దాదాపు 100 సెంటర్లకు పైగా 50 రోజుల వేడుకని జరుపుకుంది. ఇటీవల జనవరి 21నుంచి ఈ సినిమా హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటికే చాలా రికార్డులు సృష్టించిన ‘అఖండ’ మరో కొత్త ఫీట్ ని సాధించింది.

Netflix : నెట్‌ఫ్లిక్స్ షార్ట్ ఫిలిం కాంటెస్ట్.. గెలిస్తే నెట్‌ఫ్లిక్స్‌లో సినిమా ఛాన్స్

తాజాగా ప్రకాశం జిల్లా కూనమనేని వారి పాలెం అనే గ్రామంలో ఊరంతా కలిసి ‘అఖండ’ సినిమాని చూశారు. ఊర్లో తెర ఏర్పాటు చేసి ‘అఖండ’ సినిమాని ప్లే చేశారు. అఖండ సినిమాని చూడటానికి సంబరాల్లో జనాలు నాటకాలు చూడటానికి వచ్చినట్టు వచ్చారు. ఊరిలోని చాలా మంది ప్రజలు వచ్చి కూర్చుని అఖండ సినిమా చూశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.