NTR: ఎన్టీఆర్ సినిమాను ఆ బ్యూటీ ఓకే చేస్తుందా..? | Will Sai Pallavi Accept Movie With NTR

NTR: ఎన్టీఆర్ సినిమాను ఆ బ్యూటీ ఓకే చేస్తుందా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన కెరీర్‌లోని 30వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. దాదాపు మూడేళ్ల గ్యాప్ తరువాత ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్...

NTR: ఎన్టీఆర్ సినిమాను ఆ బ్యూటీ ఓకే చేస్తుందా..?

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన కెరీర్‌లోని 30వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. దాదాపు మూడేళ్ల గ్యాప్ తరువాత ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అందుకున్న తారక్, ఇప్పుడు తన నెక్ట్స్ మూవీని దర్శకుడు కొరటాల శివతో స్టార్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేసినా, ఇంకా పట్టాలెక్కించలేదు. దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు పట్టాలెక్కిస్తారా అని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా చూస్తున్నారు.

NTR: రెడీ ఫర్ చేంజ్ అంటోన్న ఎన్టీఆర్!

గతంలో ‘జనతా గ్యారేజ్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన కొరటాల శివ, ఈసారి తారక్ కోసం మరింత పవర్‌ఫుల్ స్టోరీని రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో తారక్ సరసన హీరోయిన్‌గా తొలుత ఆలియా భట్‌ను తీసుకోవాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. కానీ ఇటీవల ఆమె వివాహం జరగడంతో ఇప్పుడు ఆలియా స్థానంలో వేరొక హీరోయిన్‌ను తీసుకునేందుకు కొరటాల అండ్ టీమ్ ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవిని ఈ సినిమాలో హీరోయిన్‌గా తీసుకునేందుకు కొరటాల ప్రయత్నిస్తున్నాడట.

NTR: కొరటాలకు ఎన్టీఆర్ ఝలక్..?

ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్‌గా ఉంటుందని, గ్లామర్ డోస్ కూడా తక్కువగా ఉండటంతో, ఈ పాత్రకు సాయి పల్లవి అయితే పర్ఫెక్ట్‌గా సరిపోతుందని కొరటాల భావిస్తున్నాడు. అందుకే ఈ మేరకు సాయి పల్లవితో డిస్కషన్స్ కూడా జరుపుతున్నాడట. అయితే ఈ సినిమా కథ విన్న సాయి పల్లవి పాజిటివ్‌గా రెస్పాండ్ అయినట్లు తెలుస్తోంది. మరి ఇప్పటివరకు స్టార్ హీరోల సరసన చేయని సాయి పల్లవి తారక్‌తో సినిమాకు ఓకే చెబుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

×