Sree Leela: క‌న్న‌డ భామ‌ల హవా.. శ్రీలీలపై యంగ్ హీరోల చూపు

అలనాటి సౌందర్య నుండి ఇప్పుడు రష్మిక వరకు టాలీవుడ్ లో కన్నడ భామలకు చాలా క్రేజ్ ఉంటుంది. అనుష్క లాంటి హీరోయిన్స్ అయితే ఇండస్ట్రీని ఎలేస్తే.. ఇప్పుడు కన్నడ మూలాలున్న పూజ హెగ్డే..

Sree Leela: క‌న్న‌డ భామ‌ల హవా.. శ్రీలీలపై యంగ్ హీరోల చూపు

Sreeleela (image:instagram)

Sree Leela: అలనాటి సౌందర్య నుండి ఇప్పుడు రష్మిక వరకు టాలీవుడ్ లో కన్నడ భామలకు చాలా క్రేజ్ ఉంటుంది. అనుష్క లాంటి హీరోయిన్స్ అయితే ఇండస్ట్రీని ఎలేస్తే.. ఇప్పుడు కన్నడ మూలాలున్న పూజ హెగ్డే టాలీవుడ్ లో యమా క్రేజీగా దూసుకెళ్తుంది. వీరే కాదు నిత్యామీనన్, ప్రణీత, ప్రియమణి ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటుంది ఈ లిస్ట్. కాగా, ఇప్పుడు టాలీవుడ్ మరో కన్నడ సోయగం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

Aha: సంక్రాంతి వరకూ నాన్‌స్టాప్ తెలుగు వినోదాల పండుగ!

శ్రీకాంత్ తనయుడు రోషన్ పెళ్లి సంద‌డి సినిమాతో కన్నడ నటి శ్రీలీల తెలుగులో అడుగుపెట్టింది. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా.. హీరో, హీరోయిన్లకు మంచి పేరే వచ్చింది. ముఖ్యంగా శ్రీలీల న‌ట‌న‌, గ్లామర్, డ్యాన్స్‌తో ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో మన మేకర్స్ దృష్టి శ్రీలీలపై పడింది. ఒకవిధంగా శ్రీలీల కుర్ర హీరోలకు బెస్ట్ ఆప్ష‌న్‌గా మారింది. ఆమె యాక్టింగ్ కు అందానికి యూత్ ఫిదా అవడంతో ఈ యంగ్ బ్యూటీకి ఇప్పుడు వరుస అవకాశాలు రావడం ఖాయంగా కనిపిస్తుంది.

Liger: ఒక్క వీడియో రాలేదు.. కానీ పీక్స్‌కి చేరిన అంచనాలు!

శ్రీలీల మాస్ మహారాజా రవితేజ హీరోగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ధమాకా సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇదొక్కటే కాదు మరో నాలుగైదు సినిమాలు చర్చల దశలో ఉన్నాయట. ఇందులో శ‌ర్వా, నితిన్‌, నిఖిల్, సాయిధ‌ర‌మ్ తేజ్‌ ఇలా యంగ్ హీరోల డేట్స్ ఉన్న మేకర్స్ శ్రీలీలతో చర్చలు జరుపుతున్నారట. వీళ్ళే కాదు తెలుగులో ఎలాగూ ఇప్పుడే అరంగేట్రం కావడంతో కొత్త హీరోల‌కు కూడా శ్రీలీల బెస్ట్ ఛాయిస్ గా కనిపిస్తుంది.