Yuvaraj Biopic : క్రికెటర్ యువరాజ్ బయోపిక్.. కొత్త హీరోతో ప్రయోగం..

బాలీవుడ్ నుంచి మరో బయోపిక్ రాబోతుంది. ఇప్పటికే క్రికెట్ లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌, ఎంఎస్ ధోని, కపిల్‌ దేవ్‌ల బయోపిక్ లు వచ్చాయి. తాజాగా మరో స్టార్ క్రికెటర్ యువరాజ్

Yuvaraj Biopic :  క్రికెటర్ యువరాజ్ బయోపిక్.. కొత్త హీరోతో ప్రయోగం..

Yuvi

Yuvaraj Biopic :  ప్రస్తుతం సినీ పరిశ్రమలలో బయోపిక్‌ల హవా నడుస్తుంది. బాలీవుడ్ లో ఇది మరీ ఎక్కువగా ఉంది. ఇప్పటికే చాలా మంది సినీ, క్రీడా, రాజకీయ బయోపిక్ లని బాలీవుడ్ తెరకెక్కించింది. బయోపిక్ లకు మంచి క్రేజ్ ఉంది. వీటికి ప్రేక్షకుల నుంచి స్పందన కూడా బాగా వస్తుండటంతో బయోపిక్ ల హవా నడుస్తుంది. తాజాగా బాలీవుడ్ నుంచి మరో బయోపిక్ రాబోతుంది. ఇప్పటికే క్రికెట్ లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌, ఎంఎస్ ధోని, కపిల్‌ దేవ్‌ల బయోపిక్ లు వచ్చాయి. తాజాగా మరో స్టార్ క్రికెటర్ యువరాజ్ జీవిత చరిత్రను తెరకెక్కించనున్నారు.

సిక్సర్ల కింగ్‌ యువరాజ్‌ సింగ్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని బాలీవుడ్ ప్రముఖ దర్శక, నిర్మాత కరణ్‌ జోహార్‌ ఈ బయోపిక్ ని తెరకెక్కించేందుకు సిద్దంగా ఉన్నాడు. ఇప్పటికే యువరాజ్‌తో సంప్రదింపులు జరిపాడని సమాచారం. యువీ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు ఈ బయోపిక్ కి. త్వరలో ఈ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కబోతుందని తెలుస్తుంది.

Sharukh Khan : షారుఖ్ పార్టీలో డ్రగ్స్.. బాలీవుడ్ స్టార్ భార్యలు సైతం..

అయితే యువీ చెప్పిన ఇద్దరు స్టార్‌ హీరోలను కాదని కరణ్‌ కొత్త హీరోతో చేయాలనుకుంటున్నాడు. యువీ గతంలోనే హృతిక్‌ రోషన్‌, రణ్‌బీర్‌ కపూర్‌లలో ఎవరో ఒకరు తన బయోపిక్‌లో నటిస్తే బాగుంటుందని చెప్పాడు. కానీ కరణ్‌ కొత్త కుర్రాడు సిద్ధార్థ్‌ చతుర్వేదిని పరిచయం చేయాలని భావిస్తున్నాడు. సిద్ధార్థ్‌ యువీతో దగ్గరి పోలికలు కలిగి ఉంటాడని, అందుకే యువీని ఒప్పించి మరీ అతన్ని ఎంపిక చేశాడని టాక్‌ నడుస్తోంది. సిద్దార్థ్ ‘గల్లీ బాయ్’ సినిమాలో ఒక పాత్ర చేసాడు. మరి కొన్ని సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు. త్వరలోనే సిద్దార్థ్ చతుర్వేది హీరోగా యువరాజ్ బయోపిక్ రానుంది. మరోవైపు సీనియర్ క్రికెటర్ గంగూలీ బయోపిక్‌ కూడా తెరకెక్కబోతుంది.