కాస్త ఊరట.. అంతలోనే ఆందోళన.. దేశంలో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు

  • Edited By: vamsi , June 16, 2020 / 05:14 AM IST
కాస్త ఊరట.. అంతలోనే ఆందోళన.. దేశంలో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు

భారత్‌లో కరోనా వైరస్‌ మహమ్మారి వేగంగా విస్తరిస్తున్నప్పటికీ కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతుంది. కొన్ని రోజులుగా దేశంలో ప్రతి రోజు 300లకు పైగా కొవిడ్‌-19 మరణాలు సంభవించగా.. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 380మంది కరోనా కారణంగా చనిపోయారు. దీంతో దేశంలో కరోనాతో చనిపోయినవారి సంఖ్య 9900కి చేరింది.

గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 10,667 కేసులు నమోదవగా.. దేశంలో కరోనా వైరస్‌ బారినపడినవారి సంఖ్య 3,43,091కి చేరింది. మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 1,80,013మంది కోలుకోగా మరో 1,53,178మంది చికిత్స పొందుతున్నారు. దేశంలో వైరస్‌ బారినపడి కోలుకుంటున్న వారి సంఖ్య ప్రతిరోజు పెరుగుతుంది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 52.5శాతంగా ఉంది.

ప్రపంచంలోని మరణాల సంఖ్యలో మాత్రం బెల్జియంను దాటి భారత్‌ ఎనిమిదో స్థానానికి చేరింది. పాజిటివ్‌ కేసుల సంఖ్యలో మాత్రం భారత్‌ నాలుగో స్థానంలో ఉంది. ఇక దేశంలో మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్, మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఎక్కువగా ప్రభావితమై ఉన్నాయి. మరో ఆందోళన కలిగించే సంకేతం ఏమిటంటే, ఈశాన్య రాష్ట్రాలు రోజువారీ COVID-19 కేసులను నమోదు చేయడం ప్రారంభించాయి.

రాష్ట్రాలవారీగా కేసులు:

States/UT

Active Cases* Cured Deaths** Total cases*
Andaman and Nicobar Islands 8 33 0 41
Andhra Pradesh 3052 3316 88 6456
Arunachal Pradesh 84 7 0 91
Assam 1984 2166 8 4158
Bihar 2201 4409 40 6650
Chandigarh 52 296 6 354
Chhattisgarh 858 890 8 1756
Dadra and Nagar Haveli and Daman  31 5 0 36
Delhi 25002 16427 1400 42829
Goa 507 85 0 592
Gujarat 5886 16664 1505 24055
Haryana 4057 3565 100 7722
Himachal Pradesh 195 353 8 556
Jammu and Kashmir 2554 2604 62 5220
Jharkhand 850 905 8 1763
Karnataka 2989 4135 89 7213
Kerala 1348 1175 20 2543
Ladakh 472 82 1 555
Madhya Pradesh 2567 7903 465 10935
Maharashtra 50567 56049 4128 110744
Manipur 339 151 0 490
Meghalaya 18 25 1 44
Mizoram 116 1 0 117
Nagaland 85 92 0 177
Odisha 1190 2854 11 4055
Puducherry 102 95 5 202
Punjab 753 2443 71 3267
Rajasthan 2895 9785 301 12981
Sikkim 64 4 0 68
Tamil Nadu 20681 25344 479 46504
Telangana 2240 2766 187 5193
Tripura 652 433 1 1086
Uttarakhand 632 1189 24 1845
Uttar Pradesh 4948 8268 399 13615
West Bengal 5515 5494 485 11494
Cases being reassigned to states 7684     7684
Total 153178 180013 9900 343091