Karnataka: మతాంతర రిలేషన్‭షిప్‭లో ఉన్నారంటూ 18 మంది విద్యార్థులు సస్పెండ్

హిందూ అమ్మాయిలు, ముస్లిం అబ్బాయిల మధ్య ప్రేమాయణం కొనసాగుతోందనే గాసిప్పులు యూనివర్సిటీలో చక్కర్లు కొట్టాయి. దీంతో యూనివర్సిటీ యాజమాన్యం.. విద్యార్థులు మొబైల్ ఫోన్లు లాక్కుని తనిఖీ చేపట్టింది. వారి బ్యాగులు, ఇతర సామాన్లను సైతం తనిఖీ చేసింది. దీంట్లో ఒక ముస్లిం విద్యార్థి హిందూ విద్యార్థినికి రాసిన లవ్ లెటర్ వారి కంటబడింది.

Karnataka: మతాంతర రిలేషన్‭షిప్‭లో ఉన్నారంటూ 18 మంది విద్యార్థులు సస్పెండ్

18 PU students suspended for supporting inter-faith relationship

Karnataka: మతాంతర రిలేషన్‭షిప్‭లో ఉన్నారని 18 మంది విద్యార్థులను సస్పెండ్ చేసింది కర్ణాటకలోని ఒక ప్రైవేటు ప్రీ-యూనివర్సిటీ. సదరు విద్యార్థులను వచ్చే ఏడాది మార్చిలో జరిగే పరీక్షలకు మాత్రమే హాజరు కావాలంటూ మంగళూరులోని ఆ యూనివర్సిటీ ఆదేశించింది. ఓ మీడియా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. ఆ విద్యా సంస్థలో హిందూ అమ్మాయిలు, ముస్లిం అబ్బాయిల మధ్య రిలేషన్‭షిప్ ఉండకూడదని ఆదేశాలు ఉన్నాయట. అయితే విద్యార్థులు వాటిని అధిగమించడంతో చర్యలు తీసుకున్నట్లు ఆ విద్యా సంస్థ యాజమాన్యం తెలిపినట్లు సమాచారం.

Singapore: కాఫీ, మిల్క్ షేక్ అమ్మడం కూడా నేరమే.. అలా చేసినందుకు జైలుపాలైన ఓ వ్యక్తి

హిందూ అమ్మాయిలు, ముస్లిం అబ్బాయిల మధ్య ప్రేమాయణం కొనసాగుతోందనే గాసిప్పులు యూనివర్సిటీలో చక్కర్లు కొట్టాయి. దీంతో యూనివర్సిటీ యాజమాన్యం.. విద్యార్థులు మొబైల్ ఫోన్లు లాక్కుని తనిఖీ చేపట్టింది. వారి బ్యాగులు, ఇతర సామాన్లను సైతం తనిఖీ చేసింది. దీంట్లో ఒక ముస్లిం విద్యార్థి హిందూ విద్యార్థినికి రాసిన లవ్ లెటర్ వారి కంటబడింది. ఆరోజు సదరు విద్యార్థి క్లాసుకు రాలేదు. అనంతరం అమ్మాయి తల్లిదండ్రుల్ని పిలిపించిన యాజమాన్యం. తదుపరి తరగతులకు అనుమతి లేదని, కేవలం వార్షిక పరీక్షలకు మాత్రమే అనుమతి ఇస్తామని చెప్పారు.

Bihar: నకిలీ మద్యం తాగి ఏడుగురు మృతి, కంటిచూపు కోల్పోయిన చాలా మంది

ఇది జరిగిన మర్నాడు సదరు ముస్లిం విద్యార్థి తరగతులకు హాజరయ్యాడు. అయితే హిందూ విద్యార్థుల నుంచి విపరీతమైన ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక మళ్లీ యాజమాన్యం రంగంలోకి దిగి ఆ విద్యార్థి తల్లిదండ్రుల్ని పిలవడం, వారికి తరగతులకు అనుమతి లేదని చెప్పడం జరిగిపోయాయి. ఇలా మరో 16 మంది విద్యార్థులకు జరిగిందట.