హ్యాండ్ శానిటైజర్ చేతులు శుభ్రం చేసుకోవడానికే కాదు.. పదుల సంఖ్యలో ప్రయోజనాలు

హ్యాండ్ శానిటైజర్ చేతులు శుభ్రం చేసుకోవడానికే కాదు.. పదుల సంఖ్యలో ప్రయోజనాలు

sanitizer

Sanitiser: చలికాలంలో జలుబు, ఫ్లూ లాంటివి వ్యాప్తి చెందకుండా క్రిములను అరికట్టేందుకు శానిటైజర్ జెల్ వాడుతున్నారు. కొన్నేళ్లుగా హాస్పిటల్స్, మెడికల్ క్లినిక్స్, డాక్టర్ ఆఫీసుల్లో చేస్తున్న పని ఇదే. కాకపోతే అతిగా వాడటం వల్ల చర్మ సంబంధిత సమస్యలు వస్తాయని డెర్మటాలజిస్టులు చెబుతున్నారు. చర్మం పూర్తిగా పొడిబారిపోయేలా చేస్తాయని హెచ్చరిస్తున్నారు. కాబట్టే ఇంట్లో శానిటైజర్ ఉంచుకోండి.. కాకపోతే ఈ అవసరాల కోసమే వాడండి..

సిల్వర్ పాలిష్ చేయడానికి:
చేతికి సిల్వర్ పెట్టుకుని హ్యాండ్ శానిటైజర్‌ను ఎప్పుడైన వాడారా.. కాస్త మెరుపు పెరుగుతుంది. అందుకే సాఫ్ట్ క్లాత్‌పై కొంచెం శానిటైజర్ వేసి క్లీన్ చేయండి మెరుపు ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది.

కళ్లద్దాలు తుడుచుకోవడానికి:
కళ్లద్దాలు క్లీన్ చేసుకోవడానికి స్పెషల్ లిక్విడ్ కొనాలి. దాని కోసం ఎంత వెచ్చించాలో అని ఆలోచిస్తున్నారా.. ఒక పనిచేయండి కళ్లద్దాలపై ఉన్న వేలిముద్రలు, దుమ్ము మరకలు పోవాలంటే హ్యాండ్ శానిటైజర్ వాడి క్షణాల్లో క్లీన్ చేసుకోవచ్చు.

డియోడ్రంట్‌కు బదులుగా:
బాహు మూలల్లో బ్యాక్టీరియా పేరుకుపోయి దుర్వాసన వస్తుంది. ఆ ప్రాంతంలో శానిటైజర్ వేసుకుని తుడుచుకోవడం ద్వారా ఫ్రెష్ వాసన వస్తుండటంతో పాటు.. ఒకవేళ పర్ఫ్యూమ్ లాంటివి వాడటం మర్చిపోయినా.. మేనేజ్ చేసేస్తుంది.

మొటిమల నుంచి వేగవంతమైన ఉపశమనం
శరీరంలో వేడి బయటకువచ్చే క్రమంలో బ్యాక్టీరియా చర్మంపై పేరుకుని మొటిమలు రావడానికి కారణం అవుతుంది. ఇలా శానిటైజర్ ఆ స్పాట్‌లో రుద్దడం ద్వారా వెంటనే రిలీఫ్ వస్తుంది. ఇంకా ఏదైనా పురుగులు కుట్టినప్పుడు కూడా వాడొచ్చు. కాకపోతే పెంపుడు జంతువులపై మాత్రం శానిటైజర్ వాడకూడదనే విషయం గుర్తుంచుకోవాలి.

డ్రై షాంపూగానూ:
డ్రై షాంపూగానూ వాడొచ్చు. మీ తల ఎప్పుడూ ఫ్రెష్ గా కనిపించాలంటే శానిటైజర్ బెస్ట్ బెనిఫిట్స్ వస్తుంది. హెడ్ వాషింగ్ కు టైం లేనట్లయితే బ్లో డ్రయింగ్ కు బదులు శానిటైజర్ బెటర్. సింపుల్ గా వేళ్లకు అంటించుకుని జుట్లు మొదట్లో రుద్దుకోండి.

మేకప్ బ్రష్‌లు క్లీనింగ్
మేకప్ బ్రష్ లు క్లీనింగ్ చేసుకోవడం కోసం నానా తంటాలు పడుతుంటారు. అంత చేసినా ఇంకా ఏదో అసంతృప్తి మిగిలే ఉంటుంది. అలా అయినప్పుడు ఎక్స్‌ట్రా క్లీనింగ్ కోసం శానిటైజర్ వాడండి. పూర్తిగా ఆరిపోయేంత వరకూ గాలికి ఉంచండి. మీకు పూర్తి క్లీనింగ్ తో కనిపించడం ఖాయం.

వైట్ బోర్డుపై, క్లాత్‌లపై పర్మినెంట్ మార్కర్:
వైట్ బోర్డు మీద పర్మినెంట్ మార్కర్ తో పొరబాటున రాసేస్తే అది పోగొట్టడానికి శానిటైజర్ వాడేసుకోవచ్చు. బట్టలపై పర్మినెంట్ మార్కర్ రాతలను కూడా చెరిపేయొచ్చు. ఒకలేయర్ మీద పడిన మరకలు లోపలి వరకూ పీల్చుకోకుండా చేసేయొచ్చు.

అతుక్కుపోయిన స్టిక్కర్లు ఊడిరావడానికి
హెయిర్ స్ప్రే వాడిన మాదిరి గట్టిగా అతుక్కుపోయి ఉన్న స్టిక్కర్లను సోప్ వాటర్ తో క్లీన్ చేయలేకపోతే.. ఆ స్థానంలో శానిటైజర్ వాడుకోవచ్చు. స్కిన్, ఫర్నిచర్, గోడలపై, గిన్నెలపై, హ్యాండ్ బ్యాగ్ లపై అతికించి ఉన్న స్టిక్కర్లను తొలగించడంలో బెస్ట్ గా పనిచేస్తుంది.

కీ బోర్డు క్లీనింగ్
కీ బోర్డు అత్యంత దారుణంగా మురికి పట్టి ఉందా.. శుభ్రం చేయాలనుకున్నారా..కానీ, సాధారణ లిక్విడ్స్ చాలా ప్రమాదకరం. అయితే శానిటైజర్ తో క్లీన్ చేయొచ్చు. అలా చేసే ముందు కచ్చితంగా పవర్ తీసేయాలనే సంగతి మర్చిపోకండి.

ఇలా ఫోన్ స్క్రీన్, నెయిల్ పాలిష్, పబ్లిక్ టాయిలెట్, టచ్ స్క్రీన్, మౌస్ క్లీనింగ్, స్టెయిన్‌లెస్ స్టీల్ మీద వేలిముద్రలు పోగొట్టడానికి, డైమండ్ రింగ్ క్లీన్ చేయడానికి ఇలా శానిటైజర్ వల్ల పలు ప్రయోజనాలు ఉన్నాయి.