Alcohol : కల్తీ మద్యం కాటుకు 24 మంది బలి

నకిలీ మద్యం వ్యవహారం బీహార్ ప్రభుత్వాన్ని కుదిపేస్తోంది. సంపూర్ణ మద్యపాన నిషేధం ఉన్న రాష్ట్రంలో అక్కడక్కడా అక్రమ మద్యం ఆనవాళ్లు కనిపిస్తున్నాయి.

Alcohol : కల్తీ మద్యం కాటుకు 24 మంది బలి

Alcohol (2)

Alcohol :  నకిలీ మద్యం వ్యవహారం బీహార్ ప్రభుత్వాన్ని కుదిపేస్తోంది. సంపూర్ణ మద్యపాన నిషేధం ఉన్న రాష్ట్రంలో అక్కడక్కడా అక్రమ మద్యం ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. మద్యం దొరక్కపోవడంతో మందు బాబులు అక్రమార్కులు తయారు చేసిన కల్తీ మద్యం తాగి ప్రాణాలు విడుస్తున్నారు. కల్తీ మద్యం దేనితో తయారు చేస్తున్నారో కూడా తెలుసుకోకుండా తాగి ప్రాణాలు వదులుతున్నారు.

చదవండి : Bihar Motihari : ప్రిన్స్ పాల్ పోస్టు కోసం కొట్టుకున్నారు..వీడియో వైరల్

ఈ నెలలోనే నకిలీ మద్యానికి 24 మంది బలయ్యారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందొ అర్ధం చేసుకోవచ్చు. ఓ వైపు కల్తీ మద్యం తాగి మరణిస్తున్నా మందుబాబులు మాత్రం తాగడం ఆపడం లేదు. వెస్ట్ చంపారన్ జిల్లాలోని తెల్హువా గ్రామంలో కల్తీ మద్యం సేవించి 8 మంది చ‌నిపోయారు.

గోపాల్‌గంజ్ జిల్లాలో కల్తీ మధ్య తాగిన 16 మంది మృతి చెందారు. వీరంతా న‌కిలీ మ‌ద్యం సేవించిన త‌ర్వాతే చ‌నిపోయిన‌ట్లు అధికారులు నిర్దారించారు. మృత‌దేహాల‌కు పోస్టుమార్టం నిర్వ‌హిస్తామ‌ని, ఆ త‌ర్వాతే వారి మ‌ర‌ణాల‌కు గ‌ల క‌చ్చిత‌మైన కారణం తెలిసే అవ‌కాశం ఉంద‌ని గోపాల్‌గంజ్ పోలీసులు పేర్కొన్నారు. మృతుల్లో ట్రైబల్స్ 20 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు.

చదవండి : Alcohol : కల్తీ మద్యం తాగి 9 మంది మృతి.. మరో ఏడుగురి పరిస్థితి విషమం

బీహార్ మంత్రి జ‌న‌క్ రామ్ గోపాల్‌గంజ్ జిల్లా వెళ్లి ప‌రిస్థితిని స‌మీక్షించారు. న‌కిలీ మ‌ద్యం సేవించి ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించిన‌ట్లు మంత్రి తెలిపారు. న‌కిలీ మ‌ద్యం సేవించి ఈ ఏడాది జ‌న‌వ‌రి నుంచి అక్టోబ‌ర్ 31 వ‌ర‌కు 70 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంత మంది ప్రాణాలు కోల్పోయినా మందుబాబుల్లో మాత్రం మార్పు రావడం లేదు.