Alcohol : కల్తీ మద్యం తాగి 9 మంది మృతి.. మరో ఏడుగురి పరిస్థితి విషమం

గోపాల్‌గంజ్ జిల్లాలో ఓ వ్యక్తి ఇంట్లో బుధవారం 16 మంది కల్తీ మద్యం సేవించారు. మద్యం సేవించిన కొద్దీ సేపటికే ఓ వ్యక్తి మృతి చెందాడు.. ఆ తర్వాత వరుసగా మరో ముగ్గురు చనిపోయారు.

Alcohol : కల్తీ మద్యం తాగి 9 మంది మృతి.. మరో ఏడుగురి పరిస్థితి విషమం

Alcohol

Alcohol : కల్తీ మద్యం సేవించి తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన బీహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళితే..రాష్ట్రంలోని శ్చిమ చంపారన్ జిల్లా నౌతాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తెల్హువా గ్రామంలో బుధవారం రాత్రి ఓ వ్యక్తి ఇంట్లో బుధవారం 16 మంది కల్తీ మద్యం సేవించారు. మద్యం సేవించిన కొద్దీ సేపటికే ఓ వ్యక్తి మృతి చెందాడు.. ఆ తర్వాత వరుసగా మరో ముగ్గురు చనిపోయారు. సాయంత్రం మరో వ్యక్తి మృతి చెందాడు. మద్యం తాగిన వారి ఆరోగ్య పరిస్థితి బాగాలేదని గుర్తించే లోపే నలుగురు చనిపోయారు. ఘటన విషయం అధికారులకు తెలియడంతో కలెక్టర్‌కి సమాచారం ఇచ్చారు.

చదవండి : Bihar Motihari : ప్రిన్స్ పాల్ పోస్టు కోసం కొట్టుకున్నారు..వీడియో వైరల్

వైద్యబృందంతో గోపాల్‌గంజ్ చేరుకున్న కలెక్టర్ ప్రాథమిక చికిత్స అందించి అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఐదుగురు ప్రాణాలు విడిచారు. ఇప్పటి వరకు కల్తీమద్యం తాగినవారిలో 9 మంది మృతి చెందగా ఏడుగురు చికిత్స పొందుతున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా, బీహార్‌లో గ‌త నెల 24 నుంచి ఇప్ప‌టివ‌ర‌కు కేవ‌లం 11 రోజుల వ్య‌వ‌ధిలో మూడుచోట్ల క‌ల్తీ మ‌ద్యం చావులు చోటుచేసుకున్నాయి. అక్టోబ‌ర్ 24న సివాన్‌లో క‌ల్తీ మ‌ద్యం సేవించి న‌లుగురు ప్రాణాలు కోల్పోయారు.

చదవండి : Bihar : ఛాతిపై 21 కలశాలు పెట్టుకుని…అమ్మవారికి పూజలు

ఆ ఘ‌ట‌న‌ను మ‌రువ‌క‌ముందే ముజ‌ఫ‌ర్‌పూర్‌లోని స‌ర‌య్యా ప్రాంతంలో క‌ల్తీ మ‌ద్యం సేవించి అక్టోబ‌ర్ 28, 29 తేదీల్లో 8 మంది మృతిచెందారు. ఇప్పుడు గోపాల్‌గంజ్‌లో ఏకంగా 9 మంది క‌ల్తీ మ‌ద్యం కాటుకు బ‌ల‌య్యారు. కాగా ఈ రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలులో ఉంది. కొందరు వ్యక్తులు అక్రమంగా కల్తీ మద్యం తయారు చేస్తూ ప్రజల ప్రాణాలు హరిస్తున్నారు. తరచుగా కల్తీ మద్యం ఘటనలు చోటుచేసుకుంటుండటంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది.