Mumbai : స్వామీజీ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి కార్యక్రమంలో మహిళల మంగళసూత్రాలతో సహా పలువురు భక్తుల బంగారు ఆభరణాలు చోరీ

తాను దేవుడికి అని చెప్పుకునే స్వామీజీ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి (‘Godman’ Dhirendra Krishna Shastri) ముంబై (Mubbai)లో నిర్వహించిన కార్యక్రమంలో భక్తుల ఆభరణాలు దోపిడి జరిగింది.భారీగా నిర్వహించిన కార్యక్రమంలో బంగారు ఆభరణాలు (Gold chains) జరిగింది.

Mumbai : స్వామీజీ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి కార్యక్రమంలో మహిళల మంగళసూత్రాలతో సహా పలువురు భక్తుల బంగారు ఆభరణాలు చోరీ

‘Godman’ Dhirendra Krishna Shastri Gold chains

Mumbai : తాను దేవుడికి అని చెప్పుకునే స్వామీజీ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి (‘Godman’ Dhirendra Krishna Shastri) ముంబై (Mumbai)లో నిర్వహించిన కార్యక్రమంలో భక్తుల ఆభరణాలు దోపిడి జరిగింది. ధీరేంద్ర స్వామిజీ శనివారం, ఆదివారం(మార్చి18,19,2023) రెండు రోజుల పాటు మీరా రోడ్‌లోని సాలాసర్ సెంట్రల్ పార్కు గ్రౌండ్‌లో భారీగా నిర్వహించిన కార్యక్రమంలో బంగారు ఆభరణాలు (Gold chains) జరిగింది. మహిళ మంగళసూత్రాల(Mangal sutra)తో సహా 36మంది భక్తుల బంగారు ఆభరణాలు (Gold chains) మాయమయ్యాయి.

స్వామీజీ ఆశీర్వాదం కోసం లక్షలాదిమంది భక్తులు తరలివచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగింది.ఈ గందరగోళంలో సందట్లో సడేమియాలా కొంతమంది చేతివాటం చూపించారు.దీంతో పలువురు మహిళల మంగళసూత్రాలతో సహా 36మంది భక్తుల బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. నిర్వహకులు సరైన భద్రతా ఏర్పాట్లు చేయకపోవటం వల్లే ఈ దోపిడీ జరిగిందని పలువురు భావిస్తున్నారు. భక్తులు భారీగా తరలిరావటం..సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవటంతో స్వామీజీ ఆశీర్వాదం తీసుకోవటానికి భక్తులు పోటీ పడటంతో నెలకొన్ని గందరగోళంలో భక్తుల మెడలో బంగారు గొలుసులు మాయమయ్యాయి. మొత్తం 36 మంది తమ ఆభరాలు దోపిడీ అయ్యాయని వాపోయారు. స్వామీజీ కార్యక్రమంలో ఇలా జరుగుతుందని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కొంతమంది మహిళలు స్వామీజీ ఆశీర్వాదం కోసం వస్తే మంగళసూత్రాలు పోగొట్టుకున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. ఇది అశుభం అంటూ కన్నీరు పెట్టుకుంది. స్వామీజీ రోగాలను నయం చేస్తారని ఫోన్లలో షేర్ అయిన వీడియోలు చూసి వచ్చామని తీరా వచ్చాక మంగళసూత్రం పోగొట్టుకున్నాను అంటూ వాపోయింది సునీత గౌలి అనే మహిళ.

తన రెండేళ్ల బిడ్డ ఆరోగ్యం బాగాలేదని..ఆ బిడ్డ ఆరోగ్యం కోసం స్వామీజీ ఆశీర్వాదం తీసుకుందామని ఎంతో ఆశతో వచ్చానని తెలిపింది. కానీ పవిత్రంగా భావించే మంగళసూత్రం పోగొట్టుకోవడం బాధగా ఉందని కన్నీటి పర్యంతమైంది. మరో మహిళ నా నెక్లెస్ పోయిందని భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదనంటూ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇక్కగ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇక్కడ జరిగిన దోపిడీ గురించి నిర్వహాకుల నుంచి ఎటువంటి స్పందనా లేదు.

శాంతాబెన్ మిథాలాల్ జైన్ ఛారిటబుల్ ట్రస్ట్ (Shantaben Mithalal Jain Charitable Trust)నిర్వహించిన   కార్యక్రమంపై కొన్ని స్వచ్ఛంధ సంస్థలు ఆగ్రహం వ్యక్తంచేశాయి.  మూఢనమ్మకాలను పెంచే ఇటువంటి కార్యక్రమాలకు అనుమతి ఇవ్వకూడదని పోలీసులకు మెమోరాండం ఇచ్చాయి. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కార్యక్రమం జరిగిన ప్రాంతంలో సీసీ టీవీలను పరిశీలించి దర్యాప్తు చేస్తామని తెలిపారు.