Surekha Sikri died : చిన్నారి పెళ్లికూతురు నటి, జాతీయ ఫిల్మ్ అవార్డు గ్రహీత సురేఖా సిక్రి క‌న్నుమూత‌

ప్రముఖ న‌టి సురేఖా సిక్రి కన్నుమూశారు. జాతీయ ఫిల్మ్ అవార్డు గ్ర‌హీత‌, బాలీవుడ్ న‌టి సురేఖా సిక్రి 75 ఏళ్ల వయస్సులో గుండెపోటుతో మ‌ర‌ణించారు. బ‌దాయి హో చిత్రంతో పాటు బాలికా వ‌ధు(చిన్నారి పెళ్లికూతురు) లాంటి టీవీ షోల్లో నటించిన ఆమె అనారోగ్యంతో బాధపడుతూ సురేఖా సిక్రి తుదిశ్వాస విడిచారు.

Surekha Sikri died : చిన్నారి పెళ్లికూతురు నటి, జాతీయ ఫిల్మ్ అవార్డు  గ్రహీత సురేఖా సిక్రి క‌న్నుమూత‌

Surekha Sikri Died

actor surekha sikri passes away : ప్రముఖ న‌టి సురేఖా సిక్రి కన్నుమూశారు. జాతీయ ఫిల్మ్ అవార్డు గ్ర‌హీత‌, బాలీవుడ్ న‌టి సురేఖా సిక్రి 75 ఏళ్ల వయస్సులో గుండెపోటుతో మ‌ర‌ణించారు. బ‌దాయి హో చిత్రంతో పాటు బాలికా వ‌ధు(చిన్నారి పెళ్లికూతురు) లాంటి టీవీ షోల్లో ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. 2020లో ఆమెకు బ్రెయిన్ స్ట్రోక్ వ‌చ్చినప్పటినుంచి ఆమె పెద్దగా కోలుకోలేదు. అనారోగ్యంతో బాధపడుతూనే..ఉన్న సురేఖా సిక్రి తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె మేనేజ‌ర్ వెల్లడించారు.

సురేఖ సిక్రీ ఏ పాత్ర పోషించినా అక్కడే ఆమె కాదు పాత్రే కళ్లముందు కనిపిస్తుంది. అలా ఆమె నటనకు మూడుసార్లు జాతీయ ఫిల్మ్ అవార్డుల‌ను గెలుచుకున్నారు. త‌మాస్‌, మ‌మ్మో, సాలిమ్ లంగ్డే పే మ‌త్ రో, జుబేదా, బాలికా వ‌ధు లాంటి సీరియ‌ళ్ల‌లో న‌టించారు. 2018లో రిలీజైన బ‌దాయి హో చిత్రంలో ఆమె హీరో ఆయుష్మాన్ ఖుర్హాన్‌కు నాన‌మ్మ పాత్ర‌లో న‌టించారు.ఈ సినిమా ద్వారా ఆమెకు బెస్ట్ స‌పోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డు ద‌క్కింది. జోయా అక్త‌ర్ డైర‌క్ట్ చేసిన గోస్ట్ స్టోరీస్ లో న‌టించిందామె.సురేఖా సిక్రీ అనేకంటే బాలికా వ‌ధు(చిన్నారి పెళ్లికూతురు) సీరియల్ లో బామ్మగారి క్యారక్టర్ అంటేనే తెలుగు వారికి ఠక్కున తెలుస్తుంది.

బుల్లితెర, వెండితెరపై ఆమె నటనకు ఎన్నో అవార్డులు దక్కాయి. మరీ ముఖ్యంగా తమస్, సలీం లంగ్డే పే మత్ రో, జుబేదా, బదాయి హో వంటి సినిమాల్లోని ఆమె నటనకు జాతీయ అవార్డులు వచ్చాయి. ఇక ఆమెను అందరికీ ముఖ్యంగా తెలుగువారికి దగ్గర చేసింది బాలిక వధు అనే సీరియల్. హిందీ బుల్లితెరపై సంచలనాలు సృష్టించిన ఈ సీరియల్‌ను తెలుగులోనూ డబ్ చేశారు.అదే తెలుగులో చిన్నారి పెళ్లికూతురు.

చిన్నారి పెళ్లి కూతురు అంటూ తెలుగులో డబ్ చేసిన ఈ సీరియల్‌లో గడుసరి, మొండి, కోపిష్టి, ప్రేమను పంచే బామ్మగా సురేఖా సిక్రీ అందరినీ ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు సురేఖా సిక్రీ మరణంతో బుల్లితెర తారలు చస్పందిస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. చివరగా సురేఖా సిక్కీ నెట్‌ఫ్లిక్స్ హారర్ ఆంథాలజీ ‘ఘోస్ట్ స్టోరీస్‌’లో కనిపించారు.